Monal Gajjar Special Song In Bellamkonda Srinivas Alludu Adhurs Movie | సినిమా ఛాన్స్‌ అందుకున్న మోనాల్‌ - Sakshi
Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌‌ అందుకున్న మోనాల్‌.. ‌స్పెషల్‌ సాంగ్‌

Published Tue, Dec 29 2020 4:48 PM | Last Updated on Tue, Dec 29 2020 5:42 PM

Bigg Boss Fame Monal Gajjar Special Song In Alludu Adhurs - Sakshi

అప్పటి వరకు వాళ్ల ఫేమ్‌ ఎలా ఉన్నప్పటికీ ఒకసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టి వచ్చాక ఏదైనా జరగవచ్చు. అవకాశాలు లేని వారికి తలుపుతట్టి మరి రావొచ్చు. బిజీగా ఉన్నవారికి అవకాశాలు తగ్గిపోవచ్చు. కంటెస్టెంట్ల జీవితాల్లో బిఫొర్‌ బిగ్‌బాస్‌ ఆఫ్టర్‌ బిగ్‌బాస్‌ అనేంతలా మార్పు వస్తుంది. అయితే మిగతా సీజన్‌లతో పోలీస్తే బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్లకు హౌజ్‌ నుంచి బయటొచ్చాక సినిమా ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే సోహైల్‌ ఓ సినిమాకు సైన్‌ చేయగా.. తన తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తానని మెగాస్టార్‌ మాటిచ్చాడు. ఇక అభిజిత్‌ ఎఫ్‌ 3లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. చదవండి: విజయ్‌ ‘మాస్టర్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

ఈ జాబితాలోకి తాజాగా మోనాల్‌ గజ్జర్‌ చేరిపోయింది. ఇప్పటికే బుల్లితెరలో ప్రసారమవుతున్న ఓ డ్యాన్స్‌ షోలో జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మరోసారి తెలుగు సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది ఈ గుజరాత్‌ భామ. టాలీవుడ్‌ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రస్తుతం అల్లుడు అదుర్స్‌ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అను ఎమ్మాన్యుయేల్‌, న‌భాన‌టేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా స్పెష‌ల్ సాంగ్‌లో మోనాల్‌.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఆడిపాడనుంది. ఈ పాట కోసం అన్న‌పూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్ల సార‌థ్యంలో సెట్‌ వేసినట్లు, దీనికి శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్రాఫీ చేయనున్నారని సమాచారం. ఇక మోనాల్‌ ఎంట్రీతో సినిమాకు మ‌రింత గ్లామ‌ర్ యాడ్ కానుందనడంలో సందేహం లేదు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గొర్రెల సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న‌ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. చదవండి: అభిమానులకు రకుల్‌ గుడ్‌న్యూస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement