Sizzling Song of the Year: Samantha Back Look From Pushpa Movie - Sakshi
Sakshi News home page

Sizzling Samantha Pushpa Item Song: మాస్‌ లుక్‌లో సమంత.. ఫోటో వైరల్‌

Published Tue, Nov 30 2021 9:31 PM | Last Updated on Wed, Dec 1 2021 8:26 AM

Sizzling Song of the Year: Samantha Back Look From Pushpa Movie - Sakshi

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో  తెరెకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం  పుష్ప లో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ స్పెషల్‌ సాంగ్‌ త్వరలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలియజేస్తూ.. సమంత లుక్‌ని విడుదల చేసింది. లంగా జాకెట్‌ ధరించి, మాస్‌ లుక్‌లో బ్యాక్‌ సైడ్‌ మాత్రమే కనిపిస్తున్న సమంత ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  ‘సిజ్లింగ్‌ సాంగ్‌ ఆఫ్‌  ది ఇయర్‌’గా  వస్తున్న ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. 

ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ- సుకుమార్‌- దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో వచ్చే స్పెషల్‌ సాంగ్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చు. దానికి తోడు సమంత చేస్తున్న తొలి స్పెషల్‌ సాంగ్‌ ఇది.. మరి ఈ సాంగ్‌ ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందో చూడాలి.  రెండు భాగాలుగా తెరకెక్కుతున్న  ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ని డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement