సినిమాపై ఎఫెక్ట్‌ పడుతుందని ‘ఆజ్‌ కీ రాత్‌’కి నో చెప్పా: తమన్నా | Tamanna Bhatia Talk About Stree 2 Special Song Aaj Ki Raat | Sakshi
Sakshi News home page

సినిమాపై ఎఫెక్ట్‌ పడుతుందని ‘ఆజ్‌ కీ రాత్‌’కి నో చెప్పా..కానీ : తమన్నా

Published Fri, Sep 6 2024 6:51 PM | Last Updated on Fri, Sep 6 2024 7:04 PM

Tamanna Bhatia Talk About Stree 2 Special Song Aaj Ki Raat

హీరోయిన్‌  తమన్నా కెరీర్‌లో స్పెషల్‌సాంగ్స్‌కు ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు దాదాపు పదికిపైగా స్పెషల్‌సాంగ్స్‌లో నర్తించారు. ఆడియన్స్‌ నుంచి కూడా మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఇటీవల ‘స్త్రీ 2’ సినిమాలో తమన్నా చేసిన ‘ఆజ్‌ కీ రాత్‌’ స్పెషల్‌సాంగ్‌కు మంచి ఆదరణ దక్కింది. యూట్యూబ్‌లో 200 మిలియన్స్‌  వ్యూస్‌ ఈ పాటకు వచ్చాయి. అయితే ఈ స్పెషల్‌ సాంగ్‌కు తమన్నా మొదట నో చెప్పారు. ఈ విషయంపై తమన్నా ఇటీవల ఓ సందర్భంగా మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి ‘జైలర్‌’లో నేను చేసిన ‘వా నువ్వు కావాలయ్యా పాటకు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. 

ఆ సమయంలో నాకు ‘ఆజ్‌ కీ రాత్‌ ’ చాన్స్‌ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్‌ చేస్తే అందరూ ‘వా నువ్వు కావాలయ్యా’ పాటతో పోలికలు పెడతారు. సాంగ్‌ కాస్త అటు ఇటు అయినా సినిమాపై కూడా ఎఫెక్ట్‌ పడుతుంది. దీంతో ఇప్పుడు ఈ సాంగ్‌ ఎందుకులే? అనుకున్నాను. దీంతో ‘ఆజ్‌ కీ రాత్‌’కు మొదట నో చెప్పాను. కానీ ‘స్త్రీ 2’ దర్శకుడు ఆమర్‌కౌశిక్‌ పట్టుబట్టి ఈ పాటను నాతో చేయించుకున్నారు’’ అని మాట్లాడారు తమన్నా.

 ఇక ‘ఆజ్‌ కీ రాత్‌’ సాంగ్‌ ‘స్త్రీ 2’లో సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా, ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజ్‌కుమార్‌ రావు, శ్రద్ధా కపూర్‌ హీరో హీరోయిన్లుగా పంకజ్‌ త్రిపాఠి, అభిషేక్‌ బెనర్జీ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల రూ΄ాయల వసూళ్లను రాబట్టిందని బాలీవుడ్‌ సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement