హాలీవుడ్‌లో దీపిక స్పెషల్‌ సాంగ్‌ | Xxx 4 To End With Deepika Padukone Special Song | Sakshi

May 31 2018 1:24 PM | Updated on May 31 2018 3:16 PM

Xxx 4 To End With Deepika Padukone Special Song - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌లు హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా లాంటి వారికి హాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. మరో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనే కూడా హాలీవుడ్‌లో జెండా పాతేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే విన్‌ డీజిల్‌ తో కలిసి ట్రిపుల్‌ఎక్స్‌ రిటర్న్ ఆఫ్ ది క్సాండర్ కేజ్ సినిమాలో నటించిన దీపికా మరో భాగంలోనూ నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.

దీపికా చేసిన సెరెనా ఉంగర్‌ పాత్రను నాలుగో భాగంలో కూడా కొనసాగించనున్నారు. అంతేకాదు ఈ సినిమా చివర్లో బాలీవుడ్‌ స్టైల్‌లో ఓ స్పెషల్‌సాంగ్‌ చేయించాలని నిర్ణయించారు. దీపికతో లుంగీ డాన్స్‌ తరహాలో మాస్‌ బీట్‌ సాంగ్‌ను చిత్రీకరించేందుకు ప్లాన​ చేస్తున్నారు. పద్మావత్‌ సినిమా తరువాత వెన్ను నొప్పి కారణంగా దీపికా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా కోలుకున్న తరువాతే సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement