'ఆ సినిమాలో నాది ఏ మాత్రం జాలిలేని పాత్ర' | Deepika Padukone goes 'reckless, fearless' in ' XxX...' | Sakshi
Sakshi News home page

'ఆ సినిమాలో నాది ఏ మాత్రం జాలిలేని పాత్ర'

Published Thu, Oct 6 2016 12:30 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

Deepika Padukone goes 'reckless, fearless' in ' XxX...'

ముంబయి: త్వరలో విడుదలకానున్న చిత్రంలో తనది ఇంతకుముందు ఎన్నడూ చేయని పాత్ర అని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రస్తుతం హాలీవుడ్లోనూ అడుగుపెట్టిన దీపికా పదుకొనె చెప్పింది. త్వరలో ఆమె నటించిన 'ట్రిపుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్' అనే హాలీవుడ్ చిత్రం విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఆమె చిత్ర విశేషాలు మీడియాతో పంచుకుంది. ఈ సినిమాలో తాను ఏమాత్రం భయం లేని, ఆందోళన లేని, దయలేని పాత్రలో తాను కనిపిస్తానని చెప్పింది. సెరెనా అంగర్ అనే పాత్రలో తాను నటించానని వివరించింది. హాలీవుడ్ ప్రముఖ హీరో విన్ డీజెల్ తో కలిసి దీపికా ఈ చిత్రంలో నటించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement