హాలీవుడ్‌కు డబ్బులు ఇస్తున్న దీపికా పదుకొనె! | Deepika Padukone Become Producer To Hollywood Movie | Sakshi
Sakshi News home page

Deepika Padukone: హాలీవుడ్‌ సినిమాకు నిర్మాతగా దీపికా పదుకొనె

Published Tue, Aug 31 2021 9:28 PM | Last Updated on Tue, Aug 31 2021 10:06 PM

Deepika Padukone Become Producer To Hollywood Movie - Sakshi

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్లలో బ్యూటీ క్వీన్‌ దీపికా ప‌దుకొనె ఒకరు. స్టార్ హీరోల‌కు పోటీ పడుతూ ‘ప్రేమ్ లీలా, ప‌ద్మావ‌త్’ వంటి హిస్టారికల్‌ చిత్రాల్లో నటించి తనకంటూ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ‘ట్రిపుల్ ఎక్స్ రిట‌ర్న్ ఆఫ్ ది జాండ‌ర్ కేజ్’ అనే సినిమాతో హాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా ఆమె మ‌రో హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాతో ఆమె హాలీవుడ్‌ నిర్మాతగా మారబోతున్నారట. ఈ సినిమాలో నటిస్తూనే చిత్రానికి దీపికా సహా నిర్మాత వ్యహరిస్తున్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

చదవండి: నాకు మత్తు ఇచ్చి పోర్న్‌ వీడియో తీశారు: మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌

తాజా బజ్‌ ప్ర‌కారం ఎస్‌టీఎక్స్ ఫిలిమ్స్ (STX Films), టెంపుల్ హిల్ ప్రొడ‌క్ష‌న్‌లు కలిసి సంయుక్తంగా రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. దీనిని దీపికా తప సొంత బ్యాన‌ర్ కా ప్రొడ‌క్ష‌న్ ఈ చిత్రాన్ని కోప్రొడ్యూస్ చేయ‌నున్నట్లు సమాచారం. కాగా ప్ర‌స్తుతం దీపికా హిందీలో శకున్ బ‌త్ర డైరెక్ష‌న్‌లో ఓ సినిమాలో నటి‍స్తున్నారు. ఇక తన భర్త ర‌ణ్‌వీర్‌ సింగ్‌తో క‌లిసి 83 మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆమె స‌హ‌నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా వ‌స్తున్న ‘ప‌ఠాన్’ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్‌లో నటించగా.. నాగ్ అశ్విన్-ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రంలో ఆమె కీ రోల్‌ పోషించనున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement