
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో గురువారం పలువురు పార్టీ నేతలు నివాళి అర్పించారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ తెలంగాణ భవన్‌లోని జయశంకర్ విగ్రహానికి పూలు సమర్పించారు.
ప్రత్యేక గీతం విడుదల
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం పరితపించారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జయశంకర్‌పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని కవిత ఆవిష్కరించారు.