సింగమ్‌తో ఐటమ్!
సింగమ్‌తో ఐటమ్!
Published Sun, Nov 27 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
‘గోదావరి’లో సుమంత్ మరదలుగా నటించిన నీతూ చంద్ర గుర్తుందా? చీరకట్టు, బొట్టుతో అచ్చ తెలుగు అమ్మాయిలా మెప్పించారు. ‘గోదావరి’ తర్వాత రాజశేఖర్ ‘సత్యమేవ జయతే’లో హీరోయిన్‌గా, ‘మనం’లో గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడీ బ్యూటీ ఐటమ్ సాంగ్ ద్వారా రీ-ఎంట్రీ ఇస్తున్నారు. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సింగం-3’లో నీతు ఐటమ్ సాంగ్ చేశారు. ‘ఓ సోనే సోనే..’ సాంగ్‌లో సూర్యతో కలసి స్టెప్పులేశారు. తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 5న పాటల్ని, 16న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ స్వరకర్త.
Advertisement
Advertisement