టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌ను వివాదాలు చూట్టుముట్టుతున్నాయి. ఊ అంటావా మామ.. ఊఊ అంటావా అంటూ సాగే ఈ పాటపై పురుష సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పాటలో మీ మగబుద్ధి వంకర బుద్ధి అనే లిరిక్స్ మగవారిని చెడ్డవారిగా చూపించినట్టు ఉన్నాయంటూ ఆందోళనకు దిగారు. దీనిఇన తొలగించాలని లేదంటూ కేసు పెడుతామని ఏపీ పురుషుల సంఘం హెచ్చిరించింది.
చదవండి: వివాదంలో పుష్ప స్పెషల్ సాంగ్, స్పందించిన దేవిశ్రీ
ఇదిలా ఉంటే ఈ పాటు యూట్యూబ్‌లో దూసుకుపోతూ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప స్పెషల్ సాంగ్ మానియానే కనిపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ పాటకు కౌంటర్‌గా పేరడీలు కూడా వచ్చేశాయి. మగాళ్లంతా ఇంతే అన్న రితీలో ఉన్న లిరిక్స్‌కు అడవాళ్లకు కౌంటర్ ఇస్తూ ఉన్న ఈ పేరడీ సాంగ్ సోషల్ మీడియాలో హల్‌చలన్ చేస్తోంది. మరి ఈ పాట ఎలా ఉందో చూద్దాం.
చదవండి: సమంత స్పెషల్ సాంగ్‌ను చుట్టుముడుతున్న వివాదాలు, తమిళంలోనూ వ్యతిరేకత
‘కోక కట్టినా.. గౌను వేసినా వంకరగా చూస్తారానే లిరిక్స్‌కు దీటుగా.. పొట్టి బట్టలు వేసి టెంప్ట్ చేస్తారంటూ పేరడీ సాంగ్‌లో రాసుకొచ్చారు. రంగుతో పని లేకుండా అందరినీ వంకరగా చూస్తారన్నదానికి.. అబ్బాయి అందాన్ని కాకుండా డబ్బును చూసి ఊ.. అంటారనేది కౌంటర్ లిరిక్. బొద్దు, సన్నం కాదు.. ఒంటిగ ఉంటే.. నలిపేస్తారని అక్కడ అంటే.. షాపింగ్, సినిమా షికార్ల పేరుతో ఊడ్చేస్తారంటూ కౌంటర్ ఇచ్చారు. పెద్ద మనిషిలాగే ఉంటారు.. చీకటి పడితే.. తప్పుడు ఆలోచనలే అని అక్కడ అంటే.. సమయం వచ్చినప్పుడు అందరూ వంకరగా చూస్తారు’ అంటూ ఈ పేరడీలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పేరడీ సాంగ్ చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment