సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే వారిలో మంచు లక్ష్మి ఒకరు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఇవాళ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సరికొత్తగా ప్రేక్షకులను పలకరించింది. శివరాత్రి అంటే శివాలయాలు శివ నామ స్మరణతో మారుమ్రోగడం ఖాయం. ఈసారి మంచు లక్ష్మి కూడా ప్రత్యేక గీతంతో అభిమానులను అలరించింది. ఆది శంకరాచార్యులు రచించిన మహాశివుని ‘నిర్వాణ శతకం’ స్వయంగా పాడిన వీడియో రిలీజ్ చేసింది.
శివునిపై ప్రత్యేక పాటను మంచు లక్ష్మితో పాటు ఆమె కూతురు విద్య కూడా ఆలపించడం మరో విశేషం. ఈ సాంగ్‌ను ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసింది. దాదాపు ఎనిమిది నిమిషాల పాటు పాడిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో అలరిస్తోంది. ఈ పాటకు మంచు మనోజ్ సైతం అభినందనలు తెలిపారు. సాంగ్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. కాశీలో షూట్ చేసినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.
Always proud of you akka🙏🏼❤️ Awesome song. Wishing you and the team behind this a great success in whatever you guys do. Love you ❤️🙏🏼#HappyMahashivratri #Shambo https://t.co/IocFmhIHUr
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 18, 2023
Comments
Please login to add a commentAdd a comment