Samantha Remuneration For Pushpa Special Song, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

Samantha: స్పెషల్‌ సాంగ్‌ కోసం సమంతకు భారీ రెమ్యునరేషన్‌

Published Tue, Nov 16 2021 11:09 AM | Last Updated on Tue, Nov 16 2021 1:28 PM

Samantha Remuneration For Pushpa Special Song Will Leave You Shock - Sakshi

Samantha remuneration for Pushpa: సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.  కెరీర్‌లోనే తొలిసారిగా సమంత స్పెషల్‌ సాంగ్‌ చేస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాలుగురోజుల పాటు ఈ సాంగ్‌ షూటింగ్‌ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు గాను సమంత కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.చదవండి: కేబీఆర్‌ పార్కులో నటిపై దాడి..దర్యాప్తు ముమ్మరం

కేవలం ఒక్క పాట కోసం ఇంత భారీ రెమ్యునరేషన్‌ తీసుకోవడం అంటే రికార్డ్‌ అనే చెప్పుకోవాలి. గతంలో స్పెషల్‌ సాంగ్స్‌లో అలరించిన పూజా హెగ్డే, కాజల్‌, తమన్నాలు సైతం ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ అందుకోలేదు. కానీ సమంతకు ఉన్న క్రేజ్‌ను బట్టి కోటిన్నరకు పైగా రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు సైతం మేకర్స్‌ వెనకాడలేదట. ప్రస్తుతం సమంత తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

చదవండి: 'పుష్ప'లో సమంత స్పెషల్‌ సాంగ్‌.. అందుకే ఒప్పుకుందా?
ఊర'నాటు' స్టెప్పులేసిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement