అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటి గౌతమి ప్రత్యేక పాటను రూపొందించారు. ‘గౌతమి’ అనే టైటిల్‌తో ఉన్న ఈ పాటను గురువారం విడుదల చేశారు. ‘ఎవరూ రాయనిది ఈ కథనం..ఎప్పుడూ చూడనిది ఈ వైనం’ అంటూ మొదలయ్యే ఈ పాటలో ఆడపిల్లలపై సామాజం చూపుతున్న వివక్ష, పురిటిలోనే ఆడపిల్లలను చంపేయడం వంటి ఘటనలను చూపించారు.
అనాథలైన ఆడపిల్లలను గౌతమి చేరదీసి పెంచడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కిదాంబరి పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన ఈ పాటుకు హైమా రెడ్డి దర్శకత్వం వహించారు. మహిళలకు ఈ ప్రత్యేక పాట అంకితమంటూ గౌతమి ట్విటర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment