goutami
-
నాకు కోపం వచ్చిందటే క్షమించరాని తప్పు చేసారని అర్థం అందుకే...
-
నా కూతురితో అలా ఉంటాను కాబట్టే...భానుమతి గారు నన్ను అలా చేసేసరికి నాకు
-
సంవత్సరానికి నేను 18 సినిమాలు చేస్తే..ఇప్పటి వాళ్లేమో..
-
ప్రభుదేవాతో ఆ పాట చేయడానికి కారణం ఎవరంటే..
-
నేను బాగానే ఉన్నాను
‘‘కమల్ హాసన్ క్వారంటైన్లో ఉన్నారు’’ అనే వార్తలు శనివారం తమిళనాడులో హల్ చల్ చేశాయి. దానికి కారణం కమల్ హాసన్ నివాసం వద్ద ‘గృహ నిర్భందంలో ఉన్నారు’ అనే స్టికర్ కనిపించడమే. అయితే ‘ఆ ఇంట్లో నేను ఉండటం లేదు. ప్రస్తుతం మా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపయోగిస్తున్నాం. నేను గృహ నిర్భందంలో లేను. కానీ సామాజిక దూరం పాటిస్తున్నాను’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసి అభిమానుల అనుమానాలను క్లియర్ చేశారు కమల్. అయితే ‘గృహ నిర్భందంలో ఉన్నారు’’ అనే స్టికర్ అంటించడానికి కారణం వేరే ఉందట. కమల్ హాసన్ తో కొన్నేళ్లు సహజీవనం చేసిన గౌతమి ఈ నెల మొదటివారంలో దుబాయ్ నుంచి తిరిగి వచ్చారట. ఆమె పాస్‌పోర్టులో కమల్ పాత నివాస గృహానికి సంబంధించిన అడ్రెస్ ఉండటంతో ప్రభుత్వ ప్రతినిధులు ఆ ఇంటికి స్టికర్ అంటించారట. అసలు విషయం అది. ఇక గౌతమి తన గురించి మాట్లాడుతూ –‘‘నేను బాగానే ఉన్నాను. దుబాయ్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. మీరందరు కూడా ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం చెప్పిన సూచనలను పాటిద్దాం’’ అని ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు గౌతమి. -
నల్లగొండ గుట్టపై విషాదం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హసన్కుర్తి గ్రామానికి చెందిన గౌతమి(20), ప్రశాంత్(21) ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు కమ్మరపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం గుట్టపై ఓ చెట్టుకు రెండు మృతదేహాలు వేలాడుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో దొరికిన సిమ్ కార్డు ఆధారంగా పోలీసుల వివరాలు సేకరించి, ప్రేమజంట కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గుట్టపైన ఆనవాళ్లను బట్టి ప్రేమికుల ఆత్మహత్య నెల క్రితం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
'ఎవరూ రాయనిది ఈ కథనం..'
-
'ఎవరూ రాయనిది ఈ కథనం..'
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటి గౌతమి ప్రత్యేక పాటను రూపొందించారు. ‘గౌతమి’ అనే టైటిల్‌తో ఉన్న ఈ పాటను గురువారం విడుదల చేశారు. ‘ఎవరూ రాయనిది ఈ కథనం..ఎప్పుడూ చూడనిది ఈ వైనం’ అంటూ మొదలయ్యే ఈ పాటలో ఆడపిల్లలపై సామాజం చూపుతున్న వివక్ష, పురిటిలోనే ఆడపిల్లలను చంపేయడం వంటి ఘటనలను చూపించారు. అనాథలైన ఆడపిల్లలను గౌతమి చేరదీసి పెంచడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కిదాంబరి పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన ఈ పాటుకు హైమా రెడ్డి దర్శకత్వం వహించారు. మహిళలకు ఈ ప్రత్యేక పాట అంకితమంటూ గౌతమి ట్విటర్లో పేర్కొన్నారు. -
కాలేజీలో విద్యార్థిని కాల్చివేత
తనతో స్నేహానికి తిరస్కరించిందనే కోపంతో కాలేజీ అటెండర్ ఒకడు కాలేజీలోనే ఓ యువతిని కాల్చి చంపాడు. బెంగళూరులోని ప్రగతి కాలేజీలో 12వ తరగతి చదువుతున్న గౌతమిని(18) అటెండర్ మహేశ్ మంగళవారం రాత్రి ఆమె హాస్టల్ గదిలో నాటు తుపాకీతో కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. అతడు పక్క గదిలోకి వెళ్లి గౌతమి స్నేహితురాలైన శిరీషపైనా కాల్పులు జరిపాడని, ఆమె గాయపడిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మహేశ్‌ను అరెస్ట్ చేసి, తుపాకీని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గౌతమిది కర్ణాటకలోని తుముకూరు జిల్లా అని తెలిపారు.