Pushpa Movie Item Song: Samantha Shares A Post On Special Song With Hot Comments Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: పుష్ప స్పెషల్‌ సాంగ్‌పై సమంత హాట్‌ కామెంట్స్‌, సెక్సీగా కనిపించాలంటే..

Published Tue, Dec 21 2021 11:00 AM | Last Updated on Tue, Dec 21 2021 12:42 PM

Samantha Shares A Post On Special Song With Hot Comments Goes Viral - Sakshi

Samantha Hot Comments On Her Special Song In Pushpa Movie In Social Media: తను చేసిన ‘పుష్ప’ స్పెషల్‌ సాంగ్‌పై సమంత హాట్‌ కామెంట్స్‌ చేసింది. సెక్సీగా ఉండటానికి నెక్ట్‌ లెవల్‌ హార్డ్‌ వర్క్‌ చేయాలంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. కాగా ఈ స్పెషల్‌ సాంగ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై సమంత ఇప్పటి వరకు పరోక్షంగా స్పందిస్తూ వచ్చింది. తాజాగా ఈ పాట కోసం తను పెట్టిన ఎఫర్ట్స్‌ గురించి వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.

చదవండి: వెనక్కి తగ్గిన భీమ్లానాయక్‌, విడుదల తేదీ వాయిదా

పుష్ప స్పెషల్‌ సాంగ్‌కు సంబంధించిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నేను బాగా చేశాను, చెడ్డగా కూడా చేశాను. కొన్ని సందర్భాల్లో సీరియస్‌ అయ్యాను. నవ్వించాను కూడా. ఇలా నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో రాణించాడానికి శ్రమిస్తున్నాను. కానీ సెక్సీగా ఉండటానికి దానికి మించిన స్థాయిలో హార్డ్‌ వర్క్‌ చేయాలి’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. దీంతో సామ్‌ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. ఇక ఈ మూవీ సమంత చేసిన స్పెషల్‌ సాంగ్‌ రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామ్‌ ఈ పాటలో నటిస్తుందనగానే ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.

చదవండి: ‘పుష్ప’ స్పెషల్‌ సాంగ్‌పై ట్రోల్స్‌, ఎట్టకేలకు స్పందించిన సమంత

రిలీజ్‌ అనంతరం కూడా ఈ పాట అదే రేంజ్‌లో యూట్యూబ్‌లో దూసుకుపోయింది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అంటూ సాగే ఈ పాటకు ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చిందో అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదురయ్యాయి. ‘మీ మగ బుద్ది వంకర బుద్ధి’ అనే లిరిక్స్‌పై వివాదం చెలరేగింది. కాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ మూవీ ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తగ్గేదే లే అనే రేంజ్‌లో పుష్ప బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి నుంచి పుష్ప సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్ల నుంచి ట్రైలర్‌, పాటలకు అన్ని సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement