ట్రెండింగ్‌లో ‘దంపుడు లక్ష్మి’ స్పెషల్‌ సాంగ్‌ | Dampudu Lakshmi Song Release From Suku Purvaj Matarani Mounamidi Movie | Sakshi
Sakshi News home page

Maataraani Mounamidhi: ట్రెండింగ్‌లో ‘దంపుడు లక్ష్మి’ స్పెషల్‌ సాంగ్‌

Published Sat, May 28 2022 8:50 PM | Last Updated on Sat, May 28 2022 8:50 PM

Dampudu Lakshmi Song Release From Suku Purvaj Matarani Mounamidi Movie - Sakshi

రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్ గా సుకు పూర్వాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మాటరాని మౌనమిది’. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని ‘దంపుడు లక్ష్మి’ ఐటమ్ పాటను మధుర మ్యూజిక్ ద్వారా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ దంపుడు లక్ష్మి పాట చూసిన ప్రేక్షకులు మంచి నాటు పాట, చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ  పాటకు అషీర్ లుక్ సంగీతం అందించగా డి సైయద్ బాషా లిరిక్స్ అందించారు. రేవంత్, మనీష పాండ్రంకి, రాహుల్ కనపర్తి ఈ పాటను ఆలపించారు. ఇప్పుడు ఈ దంపుడు లక్ష్మి పాట సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ.. ‘ఇది నా రెండో సినిమా. మంచి థ్రిల్లర్ ప్రేమ కథ, కథనంతో మీ ముందుకు వస్తున్నాను. మేం ఇటీవల విడుదల చేసిన టీజర్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ‘దంపుడు లక్ష్మి’ ఐటమ్ పాటను మధుర మ్యూజిక్ ద్వారా విడుదల చేశాము. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి నాటు పాట, చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మా సంగీత దర్శకుడు అషీర్ లుక్ అద్భుతమైన పాటలు ఇచ్చారు, రాజ్ కృష్ణ డాన్స్ స్టెప్స్ ఆ పాటకు ప్రాణం పోశాయి. మా 'దంపుడు లక్ష్మి' ఐటమ్ పాట సోషల్ మీడియాలో ట్రేండింగ్‌లో ఉంది’ అని ఆయన తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement