నాలుగేళ్ల తర్వాత! | Sriya Saran to sizzle in a special song for Krishna Vamsi's 'Nakshatram' | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల తర్వాత!

Published Tue, May 2 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

నాలుగేళ్ల తర్వాత!

నాలుగేళ్ల తర్వాత!

శ్రియ నాలుగేళ్ల తర్వాత డ్యాన్స్‌ చేయబోతున్నారు. అదేంటి? ఈ నాలుగేళ్లలో ఆమె చాలా సినిమాలు చేశారు కదా. వాటిలో డ్యాన్స్‌ చేశారు కూడా అనుకుంటున్నారా? మరేం లేదు. స్పెషల్‌ సాంగ్స్‌కి ఆమె డ్యాన్స్‌ చేసి, నాలుగేళ్లయింది. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘నక్షత్రం’లో శ్రియ ఓ స్పెషల్‌ సాంగ్‌కి కాలు కదపనున్నారని టాక్‌.

కాగా, సోమవారం సన్నీ లియోన్‌ని ఈ పాటకు తీసుకున్నారనే వార్త రాగా, ‘అదేం కాదు... ఓ ప్రముఖ హీరోయిన్‌ కోసం చూస్తున్నాం’ అని యూనిట్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఆ స్టార్‌ ఈ స్టారే అన్నది మంగళవారం ఖబర్‌.

 దేవదాసు, మున్నా, తులసీ వంటి తెలుగు చిత్రాలతో పాటు మరికొన్ని తమిళ సినిమాల్లో శ్రియ స్పెషల్‌ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించారు. చివరిగా 2013లో ‘జిల్లా గజియాబాద్‌’ చిత్రంలో ఆమె స్పెçషల్‌ సాంగ్‌ చేశారు. ఇప్పుడు ‘నక్షత్రం’కి చేస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement