అక్కినేని నాగచైతన్య తన మాజీ భార్య, స్టార్ హీరోయిన్ సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కామ్‌గా ఉన్న చై ఇటీవల తొలిసారిగా వారి విడాకులపై స్పందించాడు. నాగచైతన్య తాజా చిత్రం బంగార్రాజు మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో చై తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని, ఇది ఇద్దరి సంతోషం కోసం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశాడు.
చదవండి: బ్రేకప్ చెప్పుకున్న లవ్‌బర్డ్స్!, క్లారిటీ ఇచ్చిన హీరో
ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన మరో ఇంటర్య్వూలో చై, సమంత గురించి మరోసారి ప్రస్తావించాడు. తన బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్, కెమిస్ట్రీ సమంతతోనే అంటూ ఆసక్తిగా స్పందించాడు. కాగా ఇంటర్య్వూలో యాంకర్ నాగ చైతన్యతో మీరు నటించిన హీరోయిన్స్‌లలో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో కుదిరిందని ప్రశ్నించింది. దీనికి వెంటనే చై.. ‘బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే సమంతతోనే కుదిరింది’ అంటూ తడుముకోకుండా సమాధానం చెప్పాడు. దీంతో చై కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా నాగచైతన్య-సమంత తొలిసారిగా ‘ఏం మాయ చేసావే’ సినిమాతో కలుసుకున్నారు. ఈ సినిమా సమయంలో వారిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదరిందని టాక్ కూడా వచ్చింది.
చదవండి: తొలి రోజు ‘బంగార్రాజు’ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ‘ఆటోనగర్ సూర్య’, ‘మజిలి’, ‘మనం’ చిత్రాల్లో జంటగా నటించారు. కాగా చై సమంత విడిపోయిన తర్వాత సామ్ చాలా సార్లు విడాకుల గురించి ఇండైరెక్ట్ గా స్పందింస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. కానీ నాగ చైతన్య మాత్రం విడాకుల తర్వాత ఒక్కసారి కూడా ఈ విషయంపై మాట్లాడలేదు. వరుస సినిమాలతో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. సంక్రాంతి కానుకగా నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చైతన్య తొలిసారి సమంత గురించి ప్రస్తావించడం ఆసక్తి సంతరించుకుంది. కాగా నాగచైతన్య-సమంత 2017 అక్టోబర్ 6న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment