
‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్ తర్వాత నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’.‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అన్నది క్యాప్షన్. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బంగార్రాజు టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
కేవలం మూవీ యూనిట్, నటీనటుల మధ్య నిరాండంబరంగా మ్యూజికల్ హిట్ ఈవెంట్‌ను జరుపుకున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కరోనా నేపథ్యంలో సందిగ్ధంలో పడింది. ఈ వేడుకను ఫ్యాన్స్ మధ్య గ్రాండ్‌గా జరపాలని ప్లాన్ చేశారు మేకర్స్. అయితే కోవిడ్ ప్రొటోకాల్ నిబంధనల నేపథ్యంలో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుందా లేదా అనేది అనుమానం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈవెంట్ జరగనుందంటూ అన్నపూర్ణ స్టూడియోస్, శ్రెయాస్ మీడియా తాజాగా స్పష్టం చేసింది. ఈ రోజు(గురువారం) సాయంత్రం బంగార్రాజు ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహుర్తం ఖరారైందని పేర్కొంది.
హైటెక్ సిటీలోని హోటల్ ట్రైడెంట్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన ఇచ్చారు. కాగా సంక్రాంతి బరి నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా చిత్రాలు తప్పుకోవడంతో, 'బంగార్రాజు' పెద్ద సినిమాగా నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా సంక్రాంతి పండగతో కూడిన కథ కావడం.. ఇందుకు సంబంధించిన అంశాలు కలిగి ఉండటంతో ఈ సినిమాకి కలిసొస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో చైతూలోని రొమాంటిక్ యాంగిల్‌ను దర్శకుడు పరిచయం చేయబోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment