
మైసూర్‌లో బంగార్రాజు సందడి సరదాగా సాగుతోంది. నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతీశెట్టి ప్రధాన పాత్రల్లో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్లీ వచ్చా డు’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా తాజా షెడ్యూల్ మైసూర్‌లో జరుగుతోంది. నాగచైతన్య, కృతీశెట్టి కాంబినేషన్‌లో వచ్చే లవ్ బ్యాక్‌డ్రాప్ సీన్స్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది.
చదవండి: కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దాడి.. ముఖంపై పిడిగుద్దులు, హత్యాయత్నం
‘బంగార్రాజు’ లొకేషన్‌లోని చైతూ, కృతి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైసూర్ షెడ్యూల్ పూర్తికాగానే తర్వాతి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేస్తారట ‘బంగార్రాజు’ అండ్ కో. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. కాగా 2016లో వచ్చిన హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయానా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment