తప్పు ఒకరిది... శిక్ష వేరొకరికి... | Tension Tension Movie Opening | Sakshi
Sakshi News home page

తప్పు ఒకరిది... శిక్ష వేరొకరికి...

Published Tue, Jul 15 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

తప్పు ఒకరిది... శిక్ష వేరొకరికి...

తప్పు ఒకరిది... శిక్ష వేరొకరికి...

ఓ హోమ్ మినిస్టర్ కొడుకు చేసిన తప్పిదానికి అన్నెం పున్నెం ఎరుగని ఓ జంట ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంది? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం - ‘టెన్షన్ టెన్షన్’. సత్యశ్రీ దర్శకుడు. బంగార్రాజు నిర్మాత. హైదరాబా ద్‌లో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి సురేశ్ కొండేటి కెమెరా స్విచాన్ చేయగా, రేలంగి నరసింహారావు క్లాప్ ఇచ్చారు. ‘‘మనిషన్నాక సమస్యలు సాధారణం. వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఇందులో చూపించనున్నాం. నాకు రెండు చేతులూ లేకపోయినా... ఈ సినిమా తీసి నన్ను నేను నిరూపించుకొని పదుగురికి స్ఫూర్తిగా నిలవాలనే కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను’’ అని దర్శకుడు సత్యశ్రీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement