tension tension
-
యాదద్రిలో టెన్షన్ వాతావరణం
-
ఆరోగ్యశాఖలో టెన్షన్..టెన్షన్!
– నేడు ఎంపీహెచ్‌ఏలకు కౌన్సెలింగ్ – ఎస్ఎంఎస్లతో అభ్యర్థులకు సమాచారం – బీసీ–ఈపై స్పష్టత ఇవ్వని అధికారులు – న్యాయం చేయాలంటున్న ‘మెరిట్ అభ్యర్థులు’ అనంతపురం మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖలో 24 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం డీఎంహెచ్ఓ కార్యాలయం సమావేశం హాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు పంపారు. అయితే ఇది విమర్శలకు తావిస్తోంది. ఏ శాఖలోనైనా పోస్టుల భర్తీ విషయంలో అధికారులు తప్పనిసరిగా పత్రికా ప్రకటనలు ఇస్తారు. కానీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం దీనికి తిలోదకాలిచ్చారు. ప్రభుత్వం సూచన, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 24 మంది ఎంపీహెచ్ఏలను తొలగించి వారి స్థానంలో 24 మందికి గత ఏడాది డిసెంబర్లో పోస్టింగులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రతిభకు పాతరపై వరుస కథనాలు : ఇందులో ప్రతిభకు పాతరేశారు. కనీసం కౌన్సెలింగ్ కూడా చేపట్టలేదు. కార్యాలయంలోని కొందరు అధికారులు ‘ముడుపులు’ తీసుకొని వారికి ఇష్టం వచ్చిన ప్రాంతానికి ఆర్డర్స్ ఇచ్చేశారు. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. కలెక్టర్ కోన శశిధర్ స్పందించి కౌన్సెలింగ్ ద్వారా నియామకాలు చేపట్టాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణను ఆదేశించారు. ఇదే సమయంలో 14 ఏళ్ల పాటు పని చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం వివాదాస్పదంగా మారింది. తొలగించబడిన ఉద్యోగులు ఆందోళన చేయడంతో జనవరి 10న జరగాల్సిన కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందేనని తొలగించబడిన ఉద్యోగులు ఆందోళన చేశారు. దీంతో ఇటీవల వారందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. తాజాగా కౌన్సెలింగ్ వాయిదా పడిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. నేడు కౌన్సెలింగ్ : కలెక్టర్ కోన శశిధర్ నుంచి ఇప్పటికే ఆదేశాలు రావడంతో సోమవారం కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఈ 24 మంది జాబితాలో ఒక నాన్‌లోకల్ అభ్యర్థి ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు నాన్‌లోకల్‌కు పోస్టులు ఇవ్వరాదు. పైగా 2003 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఈ పోస్టుల విషయంలో బీసీ–ఈ రిజర్వేషన్ వర్తించదు. కానీ గతంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్ వద్దకు ఫైల్ వెళ్లిన సమయంలో బీసీ–ఈకి చెందిన ఇద్దరు అభ్యర్థులను సైతం జాబితాలో ఉంచారు. ఈ విషయంలో కూడా కలెక్టర్ సీరియస్ కావడంతో వారిద్దరినీ విధుల్లోకి తీసుకునే విషయంలో వెనకడుగు వేశారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన రోజే వారిద్దరినీ ‘మళ్లీ చూద్దాం’ అని వెనక్కు పంపారు. ఈ క్రమంలో తాజాగా చేపడుతున్న నియామకాల్లో బీసీ–ఈ అభ్యర్థులను అలాగే ఉంచారా? లేదా? అన్నది బయటకు తెలియకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే కౌన్సెలింగ్ తేదీకి సంబంధించి పత్రికా ప్రకటన కూడా ఇవ్వలేదని స్పష్టమవుతోంది. న్యాయం చేయండి : ఇటీవల 24 మంది ఎంపీహెచ్ఏలు విధుల్లో చేరిన విషయం తెలిసిందే. వీరి కంటే మెరిట్లో కొందరు అభ్యర్థులు ముందున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులను కలిశారు. కలెక్టర్ కోన శశిధర్‌ను సైతం గ్రీవెన్స్‌లో కలిసి విన్నవించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణను పలుమార్లు కలిసి తమకు న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తమ పరిస్థితి ఏంటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలపై గతంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్ దృష్టికి తీసుకెళ్తే ‘మీ కంటే మెరిట్ తక్కువగా ఉన్నవాళ్లు ఉంటే చెప్పండి. మీకు న్యాయం చేస్తా’మని చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు. జిల్లాలో ఎంపీహెచ్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో మెరిట్ ప్రకారమే తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో సోమవారం జరిగే కౌన్సెలింగ్ వద్దకు రావడానికి కొందరు అభ్యర్థులు సిద్ధమయ్యారు. దీంతో ఏం జరుగుతుందన్న టెన్షన్ అధికారుల్లో నెలకొంది. -
ఉత్కంఠ
పాదయాత్ర జరిగి తీరుతుంది: ముద్రగడ ఎలా నిర్వహిస్తారు ?: మంత్రి రాజప్ప పలు ప్రాంతాల్లో పోలీసుల మోహరింపు ఎవరి ఏర్పాట్లలో వారు సాక్షిప్రతినిధి, కాకినాడ : రాష్ట్ర ప్రభుత్వానికి కాపు ఉద్యమ సెగ మరోసారి తగలనుంది. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాపులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. కాపు ఉద్యమం తాజా పరిణామాలతో మరోసారి ఉత్కంఠగా మారింది. ఈసారి కోనసీమ వేదికగా నిలుస్తోంది. ఇదే డిమాండ్ సాధన కోసం కిర్లంపూడిలో తన స్వగృహంలో ముద్రగడ పద్మనాభం తలపెట్టిన దీక్షను ప్రభుత్వం పోలీసుల బలప్రయోగంతో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించడం, అక్కడ దీక్ష కొనసాగించడం తెలిసిందే. ఆ పరిణామాల నేపథ్యంలో మలిదశ ఉద్యమంలో పాదయాత్రపై సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మరో 48 గంటల్లో (ఈ నెల 16న) ఉదయం తొమ్మిది గంటలకు రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్ నుంచి సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ యాత్ర కోనసీమలో పలు మండలాల మీదుగా అంతర్వేది పుణ్యక్షేత్రం వరకు ఐదు రోజులపాటు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. జేఏసీ సమావేశం అనంతరం ఈ విషయాన్ని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఇందుకు అనుగుణంగా కోనసీమతోపాటు జిల్లావ్యాప్తంగా స్థానిక కాపు నేతలు ఊరూవాడా ప్రచారం చేస్తూ పాదయాత్రకు సమాయత్తమవుతున్నారు. శాంతియుతంగా చేస్తుంటే అనుమతులెందుకు..? గాంధీమార్గంలో శాంతియుతంగా తలపెట్టిన పాదయాత్రకు ముందస్తు అనుమతి అవసరం లేదని ముద్రగడ, అనుమతి లేకుండా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరిస్తున్నారు. పాదయాత్ర కొనసాగిస్తామని ముద్రగడ, అనుమతి పేరిట నిలువరించాలని ప్రభుత్వం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.పాదయాత్ర జరిగే కోనసీమ, ఇటు ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిని సోమవారం నాటికే పోలీసు బలగాలతో నింపేసింది. కాపు సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభించే రావులపాలెంను పోలీసులు అష్టదిగ్భంధనం చేసే పనిలో ఉన్నారు. రావులపాలేనికి వచ్చే మార్గాలన్నింటినీ పోలీసుల చెక్‌పోస్టులతో నింపేసింది. అటు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం, ఇటు జొన్నాడ, మరోవైపు కొత్తపేట సహా రావులపాలెంకు వచ్చే రహదారులన్నింటినీ పోలీసు నియంత్రణలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఆరువేల మంది పోలీసులను వినియోగిస్తుండగా, ఇప్పటికే సగానికిపైగానే బలగాలు కోనసీమలో మకాంచేసి ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని కాపులను ఓట్బ్యాంకుగా వినియోగించుకుని ఇప్పుడు అదే కాపులపై పోలీసు బలగాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వంపై కాపు యువత అగ్గిమీద గుగ్గిలమవుతోంది. రావులపాలెం పాదయాత్ర విషయాన్ని గత అక్టోబరు మొదటి వారంలో కాపు జేఏసీ నేతలు ప్రకటించారు. పాదయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో కాపు కార్పొరేష¯ŒS చైర్మ¯ŒS చలమలశెట్టి రామానుజయ్యతో సమాంతరంగా కడపలో మరో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. చంద్రబాబు సూచనలు లేకుండా చలమలశెట్టి ఆ పాదయాత్ర చేపడతారా, కాపుల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలించే ప్రయత్నం కాక మరేమిటని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే ముద్రగడ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో భాగమేనంటున్నారు. పిఠాపురంలో కాపుల మధ్య చిచ్చుపెట్టి రెండు వర్గాలుగా విభజించి పాలించడం ఇందుకు తాజా ఉదాహరణ అంటున్నారు. పిఠాపురంలో ఎప్పుడూ ఒకేచోట కలిసికట్టుగా ఒకే కాపు సమారాధన నిర్వహిస్తుండే వారు. అటువంటిది ఈ సారి ముద్రగడ సమారాధనకు వెళుతున్నారని తెలుసుకుని చంద్రబాబు డైరెక్షన్లో అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే వర్మ కాపుల్లో చీలికపెట్టి పోటీగా సమారాధన నిర్వహించారని కాపు జేఏసీ నేతలు ఆక్షేపిస్తున్నారు. కాపుల్లో చీలిక తీసుకువచ్చినా ఉమ్మడి డిమాండ్ విషయంలో అంతా ఒకే గూటి పక్షులని ముద్రగడ పిఠాపురం సమారాధనలో పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ ప్రతినిధిగా హోంమంత్రి చినరాజప్ప వాదన మరోలా ఉంది. సెక్ష¯ŒS–30 అమలులో ఉన్నప్పుడు సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి అవసరమంటున్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు. పాదయాత్రపై ఎవరి వాదనలు వారు విన్పిస్తూనే ఇటు కాపు జేఏసీ నేతలు, మరో పక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇందులో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సిందే. మీ పాదయాత్రలకు ఎవరి అనుమతి తీసుకున్నారు శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని ముందు నుంచి చెబుతున్నా ప్రభుత్వం భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపును ఏమనుకోవాలని కాపు జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా పాదయాత్ర కుదురదంటున్న హోంమంత్రి చినరాజప్పను గతంలో అనుమతి లేకుండా పాదయాత్రలు చేయలేదా అని కాపు నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గ్రామ,గ్రామాన నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలకు ఏ పోలీసు అధికారి అనుమతి తీసుకున్నారో చెప్పాలంటున్నారు. అంతెందుకు సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన మహా పాదయాత్రకు ముందస్తు అనుమతి ఉందా అని కాపు జేఏసీ నేతల వాదిస్తున్నారు. రావులపాలెంలో పాదయాత్ర విషయాన్ని గత నెలలోనే ప్రకటించగా ఇప్పుడు హఠాత్తుగా అనుమతి కావాలని కోరడంలో ఆంతర్యమేమిటని కాపు నేతలు నిలదీస్తున్నారు. -
పోరు ముగిసింది..టెన్షన్ మిగిలింది..
అయినా గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. 25న కాకినాడలో కౌంటింగ్ సాక్షి ప్రతినిధి, కాకినాడ :రెండున్నర నెలల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో.. ఎవరు పరాజితులవుతారోనన్న టెన్షన్ మిగిలింది. ఈ ఉత్కంఠకు కూడా ఈ నెల 25న తెర పడుతుంది. బరిలో 15 మంది అభ్యర్థులున్నా.. ప్రధాన పోటీ ముగ్గురి మధ్యనే ఉంది. వీరిలో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోతుందా లేక రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు వరకూ వెళ్లాల్సిందేనా అనే చర్చ జరుగుతోంది. పోలింగ్ అనంతరం అభ్యర్థులు బూత్‌లవారీగా మద్దతుదారుల ద్వారా రప్పించుకున్న సమాచారాన్ని క్రోడీకరించుకుంటూ.. గెలుపు ఓటములను బేరీజు వేసుకునే పనిలో పడ్డారు. పోలింగ్ సరళి చూస్తుంటే తమకే అవకాశాలు బాగున్నాయంటూ ఎవరికి వారే చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి 83.71 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ పోలింగ్ శాతం పెరుగుదల వల్ల తమకే కలసివస్తుందంటూ ప్రధాన పోటీదారులు అంచనాలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో 74 శాతం ఓట్లు పోలవగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 70 శాతం నమోదైంది. ఈసారి పశ్చిమ గోదావరిలో 85 శాతం, తూర్పు గోదావరిలో 82.71 శాతం నమోదైంది. ‘పశ్చిమ’లో పెరిగిన ఓటింగ్ ఎవరికి కలిసి వస్తుందనేదానిపైనా లెక్కలు తీస్తున్నారు. ఇందుకోసం దాదాపు అభ్యర్థులంతా పోలింగ్ బూత్లవద్దకు వెళ్లి తమ అవకాశాలను అంచనా వేసుకోవడం కనిపించింది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చైతన్యరాజు కాకినాడ సిటీ, రూరల్, సామర్లకోట, పెద్దాపురం, రంగంపేట, రాజానగరం, రాజమండ్రి సిటీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చైతన్యరాజు తనయుడు, ఎమ్మెల్సీ రవివర్మ కాకినాడ సిటీ, కరప, రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, రాజోలు, అమలాపురంలోను, మరో తనయుడు, గైట్ ఎమ్డీ శశివర్మ జగ్గంపేట, గండేపల్లి, రాజానగరం తదితర ప్రాంతాల్లోను పర్యటించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగిన ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు కాకినాడ సిటీ, రూరల్, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పర్యటించగా, యూటీఎఫ్ మద్దతుతో పోటీ చేసిన రాము సూర్యారావు పశ్చిమ గోదావరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ముగ్గురే ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ఏదెలా ఉన్నా మేధావి వర్గమైన ఉపాధ్యాయులు ఎటువంటి తీర్పు ఇచ్చారో, ఎవరి తలరాతలు ఎలా మార్చేస్తారో తేలాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. చేసిన పనులే గెలిపిస్తున్నాయి ఆరేళ్ల కాలంలో ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల కోసం చేసిన సేవలే నన్ను విజయానికి చేరువ చేస్తున్నాయి. ఉపాధ్యాయ వర్గంతో ఆది నుంచీ మంచి సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలపట్ల సానుకూలంగా స్పందించడంతో వారంతా వెన్నంటి నిలిచారు. గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా నాతో ఉపాధ్యాయులకున్న స్నేహబంధం ముందు అవన్నీ దిగదుడుపే. - చైతన్యరాజు మొదటి ప్రాధాన్యంతోనే గెలుస్తా మొదటి ప్రాధాన్య ఓటుతోనే విజయం సాధిస్తాను. ఇతర అభ్యర్థుల విషయంలో నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. నిజాయితీకి, నిబద్ధతకు ఉపాధ్యాయులు పట్టం కట్టేశారు. అందరి సహకారంతో విజయం సాధించడం ఖాయమనే ధీమాతో ఉన్నా. - రాము సూర్యారావు విజయం నాదే.. పోలింగ్ సరళిని పరిశీలిస్తే విజయం నాదేనన్న నమ్మకం ఉంది. మేథావులైన ఉపాధ్యాయులు పెద్దల సభకు ఎలాంటి అభ్యర్థిని పంపితే తమకు న్యాయం జరుగుతుందనే అంశంపై బాగా ఆలోచించి ఓటు వేశారు. రాజకీయంగా కొంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా ఉపాధ్యాయులు మాత్రం ఆలోచించి ఓటు వేసినట్టుగానే కనిపిస్తోంది. - డాక్టర్ పరుచూరి కృష్ణారావు -
తప్పు ఒకరిది... శిక్ష వేరొకరికి...
ఓ హోమ్ మినిస్టర్ కొడుకు చేసిన తప్పిదానికి అన్నెం పున్నెం ఎరుగని ఓ జంట ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంది? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం - ‘టెన్షన్ టెన్షన్’. సత్యశ్రీ దర్శకుడు. బంగార్రాజు నిర్మాత. హైదరాబా ద్లో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి సురేశ్ కొండేటి కెమెరా స్విచాన్ చేయగా, రేలంగి నరసింహారావు క్లాప్ ఇచ్చారు. ‘‘మనిషన్నాక సమస్యలు సాధారణం. వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఇందులో చూపించనున్నాం. నాకు రెండు చేతులూ లేకపోయినా... ఈ సినిమా తీసి నన్ను నేను నిరూపించుకొని పదుగురికి స్ఫూర్తిగా నిలవాలనే కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను’’ అని దర్శకుడు సత్యశ్రీ అన్నారు. -
కాకరాపల్లిలో టెన్షన్-టెన్షన్