Bangarraju Movie Update: Krithi Shetty First Look Released From Bangarraju Movie - Sakshi
Sakshi News home page

Krithi Shetty: ‘బంగార్రాజు’లో కృతి పాత్ర, ఫస్ట్‌లుక్‌ విడుదల

Published Thu, Nov 18 2021 1:40 PM | Last Updated on Thu, Nov 18 2021 3:06 PM

Krithi Shetty First Look Release From Bangarraju Movie And Her Role Name - Sakshi

Krithi Shetty First Look From Bangarraju Movie: ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో నాగార్జున-దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ.. చైకు జోడీగా కృతి శెట్టి సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగార్రాజు నుంచి కృతి లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

చదవండి: 46 ఏళ్లకు తల్లైన స్టార్‌ హీరోయిన్‌, కవలలకు జననం

ఈ సందర్భంగా ఈ సినిమాల్లో ఆమె నాగలక్ష్మి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ మెడలో దండతో ఉరేగింపులో జనాల మధ్య ఉన్న కృతి లుక్‌ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ‘బంగార్రాజు’లో నాగలక్ష్మి సందడి ఒక రేంజ్‌లో ఉండబోతుందని అర్థమవుతోంది. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే ఆయన పాడిన ‘లడ్డుండా’ పాటకు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు విడుద‌లైన కృతి ఫ‌స్ట్ లుక్ కూడా అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది.

చదవండి: Shyam Singha Roy: శ్యామ్‌ సింగరాయ్‌ టీజర్‌ వచ్చేసింది

ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఉప్పెన సినిమాతో మంచి హిట్ కొట్టిన కృతి వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’, అలాగే హీరో రామ్‌-తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఓ చిత్రంతో పాటు, సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటిస్తోంది. ఇక యంగ్‌ హీరో నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మూవీలో కూడా కృతి నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement