Bangarraju Trailer: Nagarjuna & Naga Chaitanya Bangarraju Movie Trailer Out Now - Sakshi
Sakshi News home page

Bangarraju Trailer: ‘బంగార్రాజు’ ట్రైలర్‌ వచ్చేసింది, చై హంగామా మామూలుగా లేదుగా..

Published Tue, Jan 11 2022 5:19 PM | Last Updated on Tue, Jan 11 2022 6:36 PM

Nagarjuna, Naga Chaitanya Bangarraju Movie Trailer Out - Sakshi

నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్లుగా నటిస్తున్న చిత్రం​ ‘బంగార్రాజు’. 'సోగ్గాడే చిన్నినాయనా' కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగార్రాజు మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అంతేకాదు నాగార్జున్‌, నాగ చైతన్యలు వినూత్నం మూవీని ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బంగార్రాజు మూవీ ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్‌. 

చదవండి: సల్మాన్‌ ఖాన్‌తో సీక్రెట్‌ డేటింగ్‌, క్లారిటీ ఇచ్చిన నటి సమంత..

ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే.. ఈ బంగార్రాజులుగా తండ్రికోడులు ఇద్దరూ ఒకే ఫ్రేంలో ఫిదా చేస్తున్నారని చెప్పొచ్చు. ఎన్నడూ చూడని విధంగా ఈ మూవీతో చై బాగా ఆకట్టుకొనున్నాడని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. బుల్లెట్‌ బండిపై చై ఇచ్చి ఎంట్రీ ఫిదా చేస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగ్‌, చైలు తమ యాస, మ్యానరిజంతో అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇక కృతీశెట్టి పాత్ర ఈ సినిమాలో బాగా అలరించనున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్‌గా పోటీ చేస్తూ స్టేజ్‌పై కృతీ ఇచ్చే ప్రసంగం మంచి కామెడీ టచ్‌ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది.

చదవండి: స్టార్‌ హీరోకు బాబాయ్‌గా హీరో రాజశేఖర్‌!, ఏ సినిమాలో అంటే..

ఇలా మొత్తానికి అన్ని కమర్షియల్‌ హంగులతో, కామెడీ, రొమాంటిక్‌, యాక్షన్‌ సీన్స్‌తో బంగార్రాజు ట్రైలర్‌ను మేకర్స్‌ ఆసక్తిగా మలిచారు. ట్రైలర్‌ చూస్తుంటే సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసేలా ఉంది. ఈ సంక్రాంతి అక్కినేని బంగార్రాజులు హిట్‌ కొట్టడం ఖాయం అనిపిస్తోంది.  కాగా గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్‌ బంగర్రాజు మూవీ తెరకెక్కింది. అన్నపూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సింగీతం అందించాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement