Nagarjuna Bangarraju Movie Teaser Released, Video Inside - Sakshi
Sakshi News home page

Bangarraju Teaser: బంగార్రాజు టీజర్‌ వచ్చేసింది..

Published Sat, Jan 1 2022 1:46 PM | Last Updated on Sat, Jan 1 2022 4:03 PM

Nagarjuna Bangarraju Movie Teaser Released, Video Inside - Sakshi

'సోగ్గాడే చిన్నినాయనా' వంటి హిట్‌ తర్వాత నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అన్నది ఉపశీర్షిక. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు. శనివారం ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. ఇందులో కృతీశెట్టిని పడగొట్టేందుకు నాగచైతన్య రకరకాలుగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. టీజర్‌ చూస్తుంటే తండ్రిని మించిన సోగ్గాడిగా మారినట్లు తెలుస్తోంది.

'నువ్వు ఈ ఊరికే సర్పంచ్‌వి కాదు, మన రాష్ట్రానికి సర్పంచ్‌ కావాలి, దేశానికి సర్పంచ్‌వి కావాలి' అంటున్న డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమాలో చై కూడా సోగ్గాడిగా మారినట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలోని ప్రత్యేక పాటలో ఫరియా అబ్దుల్లా స్టెప్పులేసిన విషయం తెలిసిందే. జీ స్టూడియోస్‌ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement