Nagarjuna's Bangarraju Shooting To Hit Floors from 25 August - Sakshi
Sakshi News home page

స్వర్గం నుంచి వస్తున్న ‘బంగార్రాజు’

Published Wed, Aug 18 2021 7:39 AM | Last Updated on Wed, Aug 18 2021 1:30 PM

Date Locked For Nagarjuna Bangarraju Movie Shooting - Sakshi

‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్‌ ‘బంగార్రాజు’కు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 20న హైదరాబాద్‌లో జరగనుంది. రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 25 నుంచి మొదలవుతుంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో హీరోగా నటించిన నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇందులో నాగచైతన్య మరో హీరో. ఈ చిత్రంలో చైతన్యకు జోడీగా కృతీ శెట్టి నటిస్తారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్స్‌ వర్క్‌ జరుగుతోంది.
(చదవండి: కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను: లేడీ కమెడియన్‌)

హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ స్టూడియోలలో సెట్‌ వర్క్‌ జరుగుతోందని తెలిసింది. స్వర్గం సెట్స్‌ వేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో రాము, బంగార్రాజు పాత్రల్లో నటించారు నాగార్జున. చనిపోయిన బంగార్రాజు ఆత్మ రాములో ప్రవేశించిన  నేపథ్యంలో ‘సోగ్గాడే చిన్ని నాయానా’ కథనం సాగుతుంది. ఇప్పుడు ‘బంగార్రాజు’ కోసం స్వర్గం సెట్స్‌ వేయిస్తున్నారంటే... బంగార్రాజు హెవెన్‌ నుంచి ల్యాండ్‌ అయితే ఎలా ఉంటుందనే కోణంలో సినిమా సాగు తుందేమో చూడాలి.
(చదవండి: అధ్యక్ష భవనంలో తాలిబన్ల జల్సాలు.. ఆర్జీవీ షాకింగ్‌ కామెంట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement