
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. బంగార్రాజులో చైకి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుండగా.. నాగ్‌తో రమ్య కృష్ణ మరోసారి జతకడుతోంది.
చదవండి: బిగ్‌బాస్ 5: బిగ్‌బాస్ హోస్ట్‌గా శ్రుతి హాసన్!
ఇక ఇప్పటికే ఈ సినిమాలో నాగలక్ష్మిగా విడుదలై కృతిశెట్టి ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ రోజు నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా నిన్న చై ఫస్ట్‌లుక్ విడుదల కాగా, తాజాగా ‘బంగార్రాజు’ టీజర్ విడుదల చేశాడు నాగార్జున. దీనిని ‘చిన్న బంగార్రాజు’ అంటూ నాగ్ విడుదల చేశాడు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ టీజర్లో బంగార్రాజు పాత్రలో నాగచైతన్య లుక్ అదిరిపోయింది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Presenting our🔥చిన బంగార్రాజ🔥on his birthday
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 23, 2021
❤️Love you ra❤️
👉 https://t.co/GCRd9s1GbX
@chay_akkineni @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @anuprubens @ZeeStudios_ @lemonsprasad#Bangarraju #BangarrajuFirstLook #HBDChay
Comments
Please login to add a commentAdd a comment