లడ్డుందా?.. నేర్పిస్తాను కదా!: సోగ్గాడి సిత్రాలు | Bangarraju Movie: Laddunda Song Teaser Released | Sakshi
Sakshi News home page

Laddunda Song: లడ్డుందా సాంగ్‌ టీజర్‌, స్వరంలో సోగ్గాడి సిత్రాలు!

Published Sun, Nov 7 2021 8:41 PM | Last Updated on Sun, Nov 7 2021 8:41 PM

Bangarraju Movie: Laddunda Song Teaser Released - Sakshi

కింగ్‌ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎంత హిట్టో అందరికీ తెలిసిందే! ఈ సినిమాకు ప్రీక్వెల్‌ అయిన బంగార్రాజుతో హిట్‌ కొట్టడానికి రెడీ అవుతున్నాడు నాగ్‌. ఇందుకోసం రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య, కృతీ శెట్టిలను కూడా రంగంలోకి దించాడు. ‘బంగార్రాజు’ సినిమాలో ఏయన్నార్‌ని గుర్తు తెచ్చేలా నాగార్జున గెటప్‌ను డిజైన్‌ చేశారు ఈ చిత్రదర్శకుడు కల్యాణ్‌కృష్ణ.

తాజాగా ఈసినిమా నుంచి లడ్డుందా సాంగ్‌ టీజర్‌ రిలీజైంది.' బాబూ తబలా, అబ్బాయి హార్మోనీ.. తానన ననన.. డాంటకు డడనా..' అంటూ ఏదో రాగం అందుకున్నాడు. ఇదర్థం కాక ఓ వ్యక్తి రాజుగారు దీని మీనింగ్‌ ఏంటని అడిగాడు. దీనికి బంగార్రాజు ఎప్పటిలాగే ఓ నవ్వు విసిరేస్తూ.. 'ఇంతకాలం తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు? అడగాలి కదా! నేర్పిస్తాను కదా!' అని చెప్పుకొచ్చాడు. ఫుల్‌ సాంగ్‌ను నవంబర్‌ 9 ఉదయం 9.09 గంటలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా టీజర్‌ చూస్తుంటే నాగ్‌ స్వర్గంలోని దేవకన్యలతో డ్యాన్స్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement