‘‘కంగువ’ సినిమాకు మూడేళ్లు కష్టపడ్డాం. మా కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘనవిజయాన్ని అందించారు. తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. సూర్య సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ‘కంగువ’ నిలుస్తుంది’’ అని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తెలిపారు. సూర్య, దిశా పటానీ జంటగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసింది.
ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ‘కంగువ’ విడుదలైంది. ఈ నేపథ్యంలో కేఈ జ్ఞానవేల్ రాజా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కంగువ’లో మేం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. దర్శకుడు శివగారు చాలా సపోర్ట్ చేశారు. సూర్యగారు చేసిన రెండు పాత్రలకి, ఆయన నటనకి మంచి అభినందనలు వస్తున్నాయి. బాబీ డియోల్ నటన మరో హైలైట్. క్లైమాక్స్‌లో అతిథిగా వచ్చే కార్తీ పాత్రని చూసి, ఆడియన్స్ థ్రిల్ అవుతున్నారు.
ఉత్తరాదిలో రిలీజైన అన్ని దక్షిణాది సినిమాల్లో ‘కంగువ’ బిగ్ ఓపెనింగ్స్ దక్కించుకుంటోంది. ‘కంగువ 2’లో దీపికా పదుకోన్‌ని హీరోయిన్‌గా తీసుకుంటున్నామనే వార్తల్లో నిజం లేదు. అజిత్‌తో డైరెక్టర్ శివ చేయాల్సినప్రాజెక్ట్ అయ్యాక ‘కంగువ’ 2 పనులుప్రారంభిస్తాం. ప్రస్తుతం మా స్టూడియో గ్రీన్‌లో కార్తీ హీరోగా చేస్తున్న ‘వా వాత్తియార్’ చిత్రాన్ని జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో విడుదల చేస్తాం’’ అని చె΄్పారు.
Comments
Please login to add a commentAdd a comment