సాక్షి, హైదరాబాద్: వర్షాల కారణంగా హైదరాబాద్ జట్టు ఆడాల్సిన రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు కూడా పూర్తిగా రద్దయ్యాయని, వీటిని మరోసారి నిర్వహించేలా చూడాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లతో హైదరాబాద్ ఆడాల్సిన ఈ మ్యాచ్‌లలో ఎనిమిది రోజుల పాటు ఒక్క బంతి కూడా పడలేదు. ‘మా గ్రూప్‌లో అందుబాటులో ఉన్న ఆరు మ్యాచ్‌లలో రెండు పూర్తిగా రద్దు కావడం దురదృష్టకరం. ఇది మా నాకౌట్ అవకాశాలను దెబ్బ తీస్తుంది.
కాబట్టి దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ రెండు మ్యాచ్‌లను మళ్లీ నిర్వహించాలని మేం బీసీసీఐకి లేఖ రాశాము. దీనిపై బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పందించారు. హెచ్‌సీఏ అభ్యర్థనను పరిశీలిస్తామని...బోర్డు టోర్నమెంట్ అండ్ ఫిక్చర్స్ కమిటీ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన మాకు ప్రత్యుత్తరం ఇచ్చారు’ అని హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్ వెల్లడించారు.
మా మ్యాచ్‌లు ఇవ్వండి!
Published Wed, Oct 18 2017 12:35 AM | Last Updated on Wed, Oct 18 2017 12:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment