భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకం నేపథ్యంలో జింఖానా గ్రౌండ్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సిరీయస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర క్రీడా శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో చర్చల అనంతరం హెచ్‌సీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయించాలని హెచ్‌సీఏ నిర్ణయించకున్నట్లు సమాచారం .
సూమారు 7000 టికెట్లు అందుబాటులో ఉండనున్నట్లు హెచ్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి. కాగా జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల విక్రయాలను నిలిపివేసినట్లు ఓ ప్రకటనలో హెచ్‌సీఏ పేర్కొంది. మరోవైపు ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలపై హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మాత్రం భిన్నంగా స్పందించినట్లు సమాచారం. ఓవైపు ఆన్‌లైన్‌లో టికెట్లు అని వార్తలు వస్తుంటే.. ఆయన మాత్రం టికెట్లన్నీ అయిపోయాయని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబరు 25న భారత్- ఆసీస్ మధ్య మూడో టీ20 ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగనుంది.
చదవండి: Ind Vs Aus 3rd T20: మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయండి! అప్పుడే వాళ్లకు తెలిసివస్తుంది!
Comments
Please login to add a commentAdd a comment