Rajiv gandhi cricket stadium
-
భారత్‌తో తొలి టెస్టు.. హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు! వీడియో వైరల్
భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది. హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లీష్ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్, జో రూట్ వంటి ఆటగాళ్లు కన్పించారు. హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లీష్ జట్టు సోమవారం నుంచి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని లారెన్స్‌తో ఇంగ్లండ్ క్రికెట్ భర్తీ చేసింది. మరోవైపు భారత జట్టు సోమవారం హైదరబాద్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది. భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలే (కెప్టెన్), బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్, ఓలీ పోప్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్ ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, దృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్ VIDEO | England Cricket team arrives in Hyderabad for the 5-match Test series. The first Test is scheduled to be played from January 25 at the Rajiv Gandhi International Stadium. pic.twitter.com/YzGknyrSPw — Press Trust of India (@PTI_News) January 21, 2024 -
ఉప్పల్ స్టేడియంలో భారత్- ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్.. వారికి ఫ్రీ ఎంట్రీ
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టుకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. జనవరి 25 నుంచి 29 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ అధ్యక్షుడు జగన్మోహన రావు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో జగన్మోహన రావు మాట్లాడుతూ.. మేము ఎన్నికైన తర్వాత జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేశాం. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు రోజుకు 5 వేల మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నాం. అయితే మ్యాచ్ కి ముందే స్కూల్ నుంచి లెటర్ హెచ్‌సీఏకు పంపించాల్సి ఉంటుంది. హెచ్‌సీఏకు పాఠశాల నుంచి లెటర్ అందితే టిక్కెట్లను నేరుగా వారివద్దకే పంపిస్తాం. ఒక స్కూల్ కి ఒకరోజు మాత్రమే అవకాశం కల్పిస్తాం. అదే విధంగా విద్యార్థులకు ఫ్రీ గా ఫుడ్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఆర్మీ జవాన్లకు ఫ్రీ ఎంట్రీ.. అదే విధంగా ఈ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీ జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మ్యాచ్‌కు అనుమతిస్తామని జగన్మోహన రావు వెల్లడించారు. ఆసక్తి గల వారు ఈ నెల 18వ తేదీలోపు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖను, కుటుంబ సభ్యుల వివరాలను హెచ్‌సీఏ సీఈవోకు మెయిల్ చేయాలని ఆయన చెప్చుకొచ్చారు. కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 26వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి జింఖానా మైదానంలో ఫిజికల్ టిక్కెట్లను హెసీఏ విక్రయించనుంది. చదవండి: పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్.. దేశాన్ని వీడనున్న స్టార్ ఆటగాడు!? -
Ind Vs NZ: ఉప్పల్ మ్యాచ్.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు
India Vs New Zealand- 1st ODI- Tickets Details- సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 22, 2022... భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టి20 మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసేందుకు సికింద్రాబాద్ జింఖానా మైదానానికి వచ్చిన అభిమానులు... సరైన ఏర్పాట్లు లేక తోపులాట... పోలీసుల రంగప్రవేశం... ఏడుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు... ఈ ఘటనను క్రికెట్ అభిమానులు ఎవరూ మరచిపోలేరు. గతానుభవం నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పాఠం నేర్చుకుంది. ఫ్యాన్స్ అడిగారంటూ గత మ్యాచ్ సమయంలో ‘ఆఫ్‌లైన్’లో కౌంటర్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్ల అమ్మకాలు ప్రారంభించి తీవ్ర రచ్చకు కారణమైన హెచ్‌సీఏ ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా టికెట్ల అమ్మకంపై ముందే స్పష్టతనిచ్చేసింది. ‘ఆన్లైన్’ ద్వారానే ఈ నెల 18న ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన మొత్తం టికెట్లన్నీ ‘ఆన్లైన్’ ద్వారానే అమ్ముతామని... ‘పేటీఎం’ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ వెల్లడించారు. హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్, పర్యవేక్షణ కమిటీ సభ్యుడు వంకా ప్రతాప్‌తో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. 2019 మార్చి 2న భారత్, ఆస్ట్రేలియా తలపడిన తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న వన్డే మ్యాచ్ ఇదే. కలెక్షన్ పాయింట్ల వద్ద కూడా ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అజహర్ చెప్పారు. టికెట్ల అమ్మకాల వివరాలు మ్యాచ్ తేదీ: జనవరి 18, మధ్యాహ్నం గం.1:30 నుంచి అందుబాటులో ఉన్న టికెట్లు: 29,417 టికెట్ల ధరలు (కార్పొరేట్ బాక్స్ టికెట్ సహా): రూ. 850, రూ.1000, రూ. 1250, రూ. 1500, రూ. 2,500, రూ. 5,000, రూ.7,500, రూ.9,000, రూ.10,000, రూ. 17,700, రూ. 20,650. అమ్మకాల తేదీలు: జనవరి 13, 14, 15, 16 (ప్రతి రోజూ సా. 5 గంటల నుంచి)... తొలి రోజు 6 వేలు, రెండో రోజు 7 వేలు, మూడో రోజు 7 వేలు, నాలుగో రోజు మిగిలిన టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఎక్కడ: ‘పేటీఎం’ వెబ్సైట్లో : ఒక్కొక్కరు గరిష్టంగా 4 టికెట్లే కొనవచ్చు ఫిజికల్ టికెట్ కోసం.. ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే దానిని మార్చుకునే ‘కలెక్షన్ పాయింట్’ను ఎంచుకోవాలి. క్యూఆర్ కోడ్ చూపిస్తే అక్కడ ‘ఫిజికల్ టికెట్’ ఇస్తారు. ఇది ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తారు. మార్చుకునే సమయంలో ఏదైనా గుర్తింపు పత్రం (ఐడీ కార్డు) తప్పనిసరి. కలెక్షన్ పాయింట్లు ఎల్బీ స్టేడియం, జీఎంసీ బాలయోగి స్టేడియం–గచ్చిబౌలి (జనవరి 15 నుంచి ఉదయం. గం. 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య) చదవండి: PAK VS NZ 2nd ODI: కాన్వే సూపర్ సెంచరీ.. పాక్‌ను మట్టికరిపించిన న్యూజిలాండ్ -
హెచ్‌సీఏ కీలక నిర్ణయం! రాత్రి 7 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లు!
భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకం నేపథ్యంలో జింఖానా గ్రౌండ్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సిరీయస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర క్రీడా శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో చర్చల అనంతరం హెచ్‌సీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లను విక్రయించాలని హెచ్‌సీఏ నిర్ణయించకున్నట్లు సమాచారం . సూమారు 7000 టికెట్లు అందుబాటులో ఉండనున్నట్లు హెచ్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి. కాగా జింఖానా గ్రౌండ్లో టికెట్ల విక్రయాలను నిలిపివేసినట్లు ఓ ప్రకటనలో హెచ్‌సీఏ పేర్కొంది. మరోవైపు ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలపై హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మాత్రం భిన్నంగా స్పందించినట్లు సమాచారం. ఓవైపు ఆన్లైన్లో టికెట్లు అని వార్తలు వస్తుంటే.. ఆయన మాత్రం టికెట్లన్నీ అయిపోయాయని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబరు 25న భారత్- ఆసీస్ మధ్య మూడో టీ20 ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగనుంది. చదవండి: Ind Vs Aus 3rd T20: మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయండి! అప్పుడే వాళ్లకు తెలిసివస్తుంది! -
ముంబయి ఇండియన్స్ ఘనవిజయం
-
వార్నర్-బెయిర్‌స్టోల భాగస్వామ్యం అసాధారణం
సాక్షి, హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో నెలకొల్పిన 185 పరుగుల రికార్డు భాగస్వామ్యంపై పలువురు క్రీడా దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వాతావరణంలో వేడి అధికంగా ఉన్నప్పటికీ అలసిపోకుండా, వికెట్ల మధ్య చకాచకా పరుగులు తీస్తూ, అద్బుతమైన క్రికెటింగ్ షాట్లు ఆడుతూ మరిచిపోలేని భాగస్వామ్యం ఈ ఇద్దరు నెలకొల్పారని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో సెంచరీల మోత వల్ల సన్‌రైజర్స్ ఐపీఎల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ కెరీర్లో వార్నర్ నాలుగు సెంచరీలు చేయగా మూడు సెంచరీలు ఇదే మైదానంలో సాధించడం విశేషం. వార్నర్ ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 114 పరుగులు చేసిన బెయిర్ స్టో ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 231 పరుగులు భారీ స్కోరు చేయగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్.. సన్‌రైజర్స్ బౌలర్ మహ్మద్ నబీ(11/4) ధాటికి 19.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 118 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తమ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని, మహ్మద్ నబీ, సందీప్‌లు బౌలింగ్‌లో రాణించడంతో బెంగుళూర్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగామని, సీరిస్ మొత్తం ఇలాగే విజయ పరంపర కొనసాగిస్తామని సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
వెస్ట్‌పై సౌత్‌జోన్ గెలుపు
ఎస్జేఎఫ్ఐ-జేకే బోస్ టి20 క్రికెట్ సాక్షి, హైదరాబాద్: భారత స్పోర్ట్స్ జర్నలిస్టుల సమాఖ్య (ఎస్జేఎఫ్ఐ) జాతీయ కన్వెన్షన్‌లో భాగంగా బుధవారం జేకే బోస్ ఇంటర్ జోనల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సౌత్‌జోన్ 10 వికెట్ల తేడాతో వెస్ట్‌జోన్‌పై గెలుపొందగా, నార్త్‌జోన్ 53 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌పై విజయం సాధించింది. ఉప్పల్ రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, టేబుల్ టెన్నిస్‌లో అర్జున అవార్డీ మీర్ ఖాసీమ్ అలీ ముఖ్య అతిథులుగా విచ్చేసి టోర్నీని లాంఛనంగా ఆరంభించారు. సౌత్, వెస్ట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ 19.4 ఓవర్లలో 94 పరుగులు చేసి ఆలౌటైంది. తావుస్ రిజ్వీ 22 పరుగులు చేయగా, సౌత్ బౌలర్లలో సత్య 3 వికెట్లు పడగొట్టాడు. సుదర్శన్, భగ్లోత్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సౌత్‌జోన్ 13.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 95 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఓపెనర్ రోషన్ త్యాగరాజన్ (47 బంతుల్లో 67 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. మరో మ్యాచ్ స్కోర్లు: నార్త్‌జోన్ 163/5 (సిద్ధార్థ్ శర్మ 62, అమిత్ చౌదరి 54; అబ్దుల్ అజీజ్ 2/24), ఈస్ట్‌జోన్: 110/9 (కిరిటీ దత్త 42; ధర్మేంద్ర పాని 2/22, అమిత్ 2/24, సుధీర్ ఉపాధ్యాయ్ 2/9).