భారత్‌తో తొలి టెస్టు.. హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లండ్‌ జట్టు! వీడియో వైరల్‌ | England team arrives in Hyderabad ahead of 1st Test against India | Sakshi
Sakshi News home page

IND vs ENG: భారత్‌తో తొలి టెస్టు.. హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లండ్‌ జట్టు! వీడియో వైరల్‌

Jan 22 2024 7:53 AM | Updated on Jan 22 2024 8:44 AM

England team arrive in Hyderabad ahead of 1st Test against India - Sakshi

భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది. హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లీష్‌ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఇంగ్లండ్‌ టెస్టు జట్టు హెడ్‌ కోచ్‌ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, జో రూట్‌ వంటి ఆటగాళ్లు కన్పించారు. హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లీష్‌ జట్టు సోమవారం నుంచి ఉప్పల్‌లోని  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనుంది.

అయితే తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్‌ తగిలింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వ్యక్తిగత కారణాలతో సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని లారెన్స్‌తో ఇంగ్లండ్‌ క్రికెట్‌ భర్తీ చేసింది. మరోవైపు భారత జట్టు సోమవారం హైదరబాద్‌కు చేరుకునే ఛాన్స్‌ ఉంది.

భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు: జాక్‌ క్రాలే (కెప్టెన్‌), బెన్‌ డకెట్‌, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), రెహాన్‌ అహ్మద్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌ ఫోక్స్‌, ఓలీ పోప్‌, జేమ్స్‌ ఆండర్సన్‌, గస్‌ అట్కిన్సన్‌, షోయబ్‌ బషీర్‌, టామ్‌ హార్ట్లీ, జాక్‌ లీచ్‌, ఓలీ రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, దృవ్‌ జురెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఆవేశ్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement