హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టుకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. జనవరి 25 నుంచి 29 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ అధ్యక్షుడు జగన్మోహన రావు తెలిపారు.
శనివారం విలేకరుల సమావేశంలో జగన్మోహన రావు మాట్లాడుతూ.. మేము ఎన్నికైన తర్వాత జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేశాం. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు రోజుకు 5 వేల మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నాం.
అయితే మ్యాచ్ కి ముందే స్కూల్ నుంచి లెటర్ హెచ్‌సీఏకు పంపించాల్సి ఉంటుంది. హెచ్‌సీఏకు పాఠశాల నుంచి లెటర్ అందితే టిక్కెట్లను నేరుగా వారివద్దకే పంపిస్తాం. ఒక స్కూల్ కి ఒకరోజు మాత్రమే అవకాశం కల్పిస్తాం. అదే విధంగా విద్యార్థులకు ఫ్రీ గా ఫుడ్ కూడా అందిస్తామని పేర్కొన్నారు.
ఆర్మీ జవాన్లకు ఫ్రీ ఎంట్రీ..
అదే విధంగా ఈ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీ జవాన్‌లకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మ్యాచ్‌కు అనుమతిస్తామని జగన్మోహన రావు వెల్లడించారు. ఆసక్తి గల వారు ఈ నెల 18వ తేదీలోపు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖను, కుటుంబ సభ్యుల వివరాలను హెచ్‌సీఏ సీఈవోకు మెయిల్ చేయాలని ఆయన చెప్చుకొచ్చారు.
కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 26వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి జింఖానా మైదానంలో ఫిజికల్ టిక్కెట్లను హెసీఏ విక్రయించనుంది.
చదవండి: పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్.. దేశాన్ని వీడనున్న స్టార్ ఆటగాడు!?
Comments
Please login to add a commentAdd a comment