'హెచ్సీఏ ఫలితాల్ని ప్రకటించండి' | high court orders hca to release election results | Sakshi
Sakshi News home page

'హెచ్సీఏ ఫలితాల్ని ప్రకటించండి'

Published Thu, Mar 30 2017 12:04 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

'హెచ్సీఏ ఫలితాల్ని ప్రకటించండి' - Sakshi

'హెచ్సీఏ ఫలితాల్ని ప్రకటించండి'

హైదరాబాద్: ఈ జనవరిలో జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికల ఫలితాల్ని తక్షణమే ప్రకటించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హెచ్సీఏ ఎన్నికల రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టిచేసింది. దీనిలో భాగంగా ఇంతకముందు రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. దాంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమైంది. ఇవాళ లేదా రేపు ఎన్నికలు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

జనవరి 17వ తేదీన హెచ్సీఏ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన హైకోర్టు దానిపై తుది తీర్పునిచ్చింది. ఆ పిటిషన్ ను కొట్టివేస్తునే ఎన్నికల ఫలితాల్ని విడుదల చేయాలంటూ ఆదేశించింది. ఇప్పటికే సెక్రటరీగా శేషు నారాయణ ఏక గ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement