షేక్‌ వాజిద్‌ డబుల్‌ సెంచరీ | sheikh wajid slams double century | Sakshi
Sakshi News home page

షేక్‌ వాజిద్‌ డబుల్‌ సెంచరీ

Published Mon, Sep 11 2017 10:58 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

షేక్‌ వాజిద్‌ డబుల్‌ సెంచరీ

షేక్‌ వాజిద్‌ డబుల్‌ సెంచరీ

130 బంతుల్లో 204; 22 ఫోర్లు, 6 సిక్సర్లు
 ఎ–3 డివిజన్‌ వన్డే లీగ్‌  


సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌సీఏ ఎ–3 డివిజన్‌ వన్డే లీగ్‌లో అంబర్‌పేట్‌ సీసీ జట్టు బ్యాట్స్‌మన్‌ షేక్‌ వాజిద్‌ (130 బంతుల్లో 204; 22 ఫోర్లు, 6 సిక్సర్లు) అదరగొట్టే ప్రదర్శన చేశాడు. రిలయన్స్‌ సీసీతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు డబుల్‌ సెంచరీతో విజృంభించాడు. దీంతో ఆ జట్టు 419 పరుగుల తేడాతో రిలయన్స్‌ సీసీ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన అంబర్‌పేట్‌ సీసీ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 505 పరుగుల భారీస్కోరు చేసింది. వాజిద్‌తో పాటు చందు (100 బంతుల్లో 166 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. షేక్‌ నాజిర్‌ (66) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో అభినవ్‌ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రిలయన్స్‌ జట్టును నాజిర్‌ (6/39) వణికించాడు. అతని ధాటికి 21.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

మరో మ్యాచ్‌ వివరాలు
రాజు సీఏ: 63 (ప్రతీక్‌ సెహగల్‌ 6/23, మానిక్‌ 4/28), పికెట్‌ సీసీ: 64 (సాహి తి కుమార్‌ 30, జ్ఞాన సాయి 18).  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement