సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వన్డే నాకౌట్ చాంపియన్‌షిప్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ జట్టు ముందంజ వేసింది. బ్యాట్స్‌మెన్ ఎంఎస్‌ఆర్ చరణ్ (103 బంతుల్లో 138; 17 ఫోర్లు, 6 సిక్సర్లు), బి. సందీప్ (67 బంతుల్లో 112 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో దుమ్మురేపడంతో సలీమ్‌నగర్ జట్టుపై బుధవారం 183 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్‌కమ్ ట్యాక్స్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 398 పరుగుల భారీస్కోరు సాధించింది. చరణ్ అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా, సందీప్ అజేయ మెరుపు శతకంతో విజృంభిం చాడు. వీరిద్దరికి తోడు అక్షత్ రెడ్డి (53) అర్ధసెంచరీతో జట్టు భారీ స్కోరును అందుకుంది. అనంతరం సలీంనగర్ సీసీ 45 ఓవర్లలో 9 వికెట్లకు 215 పరుగులే చేసి పరాజయం పాలైంది. మీర్జా బేగ్ (40), ధనుశ్ (40), ఖాలిద్ ఖురేషి (51) పోరాడారు.
ఆకాశ్, రిషికేత్ అజేయ శతకాలు
కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ ఆకాశ్ యాదవ్ (98 బంతుల్లో 114 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషికేత్ సిసోడియా (83 బంతుల్లో 102 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో ఉస్మానియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేంబ్రిడ్జ్ ఎలెవన్ 75 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత కేంబ్రిడ్జ్ ఎలెవన్ 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 224 పరుగులు చేసింది. అనంతరం ఉస్మానియా జట్టు 24.1 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. హృదయ్ (42) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో మోహిత్ 3, సాత్విక్ 4 వికెట్లు దక్కించుకున్నారు.
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
హైదరాబాద్ బ్లూస్ సీసీ: 88 (సౌరవ్ రాథోడ్ 3/24, యశ్వంత్ రెడ్డి 3/14, కమల్ 4/20), ఎవర్‌గ్రీన్ సీసీ: 92/1 (విక్రమ్ నాయక్ 34 నాటౌట్, రాహుల్ బుద్ధి 44 నాటౌట్).
విజయ్ హనుమాన్ సీసీ: 68 (శుభమ్ 3/11, రంగనాథ్ 4/20), జై హనుమాన్: 72/4 (సూర్యతేజ 31 నాటౌట్).
ఎన్‌స్కాన్స్: 385/4 (సాయివ్రత్ 121, జునైద్ అలీ 56, మెహదీ హసన్ 45, అజర్ 59; విష్ణు 3/42), అగర్వాల్ సీనియర్ సీసీ: 69 (మెహదీ హసన్ 5/23).
డెక్కన్ క్రానికల్: 317/3 (యశ్ కపాడియా 143, నితీశ్ 66, సీవీ మిలింద్ 88 నాటౌట్), గ్రీన్ టర్ఫ్: 141/6 (అక్షయ్ 32, కార్తీక్ 33 నాటౌట్).
జెమినీ ఫ్రెండ్స్: 248/7 (షేక్ యాసిన్ 109, సాయి ప్రణయ్ 65), మహబూబ్‌నగర్: 223 (హర్షవర్ధన్ 115; రతన్‌తేజ 3/41).
సాయి సత్య సీసీ: 231/8 (నిఖిల్ యాదవ్ 69), నిజామాబాద్: 232/7 (శ్రీకర్ రెడ్డి 92, లలిత్ యాదవ్ 42).
Comments
Please login to add a commentAdd a comment