
హైదరాబాద్: హెచ్‌సీఏలో తాజాగా చేపట్టిన నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు మాజీ క్రికెటర్లు ధ్వజమెత్తారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్, మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్, హెచ్‌సీఏ ప్రతినిధి శేష్‌నారాయణ ఈ అంశంపై మాట్లాడారు. ఆదివారం జరిగిన హెచ్‌సీఏ సమావేశంలో సభాధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి అబద్ధాలతో కూడిన సమాచారాన్ని వెల్లడించారన్నారు.
హెచ్‌సీఏ తరఫున బీసీసీఐ ప్రతినిధిగా వివేక్ పేరును ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించిన సమాచారంలో నిజం లేదని అన్నారు. నిజానికి ఒకసారి అనర్హత వేటు పడిన వ్యక్తిని సిఫార్సు చేయకూడదనే నిబంధన ఉందని ఆయన స్పష్టం చేశారు. పది మంది కుమ్మక్కై ఇలా చేయడం సరికాదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆదివారం నాటి హెచ్‌సీఏ సమావేశంలో అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ ఎంఎన్ రావు, ఎన్నికల అధికారిగా వీఎస్ సంపత్‌ను నియమించారు. వీరితో పాటు హెచ్‌సీఏ నుంచి బీసీసీఐ ప్రతినిధిగా జి.వివేకానందను, జూనియర్ సెలక్షన్ కమిటీ, క్రికెటింగ్ కమిటీని ఎంపిక చేశారు. ఈ నియామకాలనే తాజాగా అజహరుద్దీన్ బృందం తప్పుబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment