సాక్షి, హైదరాబాద్: క్రికెట్‌లో రాణిస్తోన్న వర్ధమాన మహిళా క్రికెటర్లకు మంచి అవకాశం. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నేడు అండర్–23, సీనియర్ మహిళల కేటగిరీలో సెలక్షన్ ట్రయల్స్ జరుగనున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉదయం 10 గంటలకు అం డర్–23 విభాగంలో, మధ్యాహ్నం గం. 2: 30కి సీనియర్ మహిళల కేటగిరీలో సెలక్షన్స్ నిర్వహిస్తారు.
ఆసక్తిగలవారు జనన ధ్రువీకరణ, బోనఫైడ్ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సెలక్షన్స్‌కు హాజరు కావాలి. వర్షం కారణంగా జింఖానా గ్రౌండ్స్‌లో జరగాల్సిన ఈ సెలక్షన్స్ వేదికను ఉప్పల్‌కు మార్చారు.