హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్‌ విజయం | Vivek panel wins HCA | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్‌ విజయం

Published Sat, Apr 1 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్‌ విజయం

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్‌ విజయం

హైదరాబాద్‌: క్రీడావర్గాల్లో ఉత్కంఠరేకెత్తించిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) ఎన్నికల ఫలితాలు శుక్రవారం రాత్రి వెలువడ్డాయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి. వివేక్‌ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా విజయం సాధించారు. వికేవ్‌కు మొత్తం 136 ఓట్లురాగా, ఆయన ప్రత్యర్థి విద్యుత్‌ జయసింహకు కేవలం 68 ఓట్లు పడ్డాయి. వికేవ్‌ గెలుపుతో ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు.

హెచ్‌సీఏ పాలకమండలికి జనవరిలోనే ఎన్నికలు జరిగినప్పటికీ, కోర్టు ఉత్తర్వుల మేరకు అధ్యక్ష ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. ఎన్నికలను సవాల్‌ చేస్తూ దాఖలైన సివిల్‌ రివిజన్‌ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి. భట్‌ కొట్టివేస్తూ గురువారం ఆదేశాలు జారీచేయడంతో శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement