G. Vivek
-
‘కేసీఆర్‌ను ఓడించి.. వాళ్లను గెలిపిద్దాం’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారమని, ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రతికి ఉండగానే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అవుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్‌పై యుద్ధం చేసే ప్రతి ఒక్కరినీ తాను అభినందిస్తానని చెప్పారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌కు మొట్టమొదటి సారిగా సవాల్ విసిరిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు. సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని కేసీఆర్ అంటే.. ఎంతమందిని డిస్మిస్ చేసినా తాము సమ్మెలో పాల్గొంటామని కార్మికులు ధిక్కరించారు. ఆర్టీసీని అమ్ముతామని కేసీఆర్ అంటే... ఆర్టీసీని కాపాడుకుంటామని కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఆర్టీసీని ఖతం చేయాలనుకుంటే కేసీఆర్ ఖతం అవుతాడు. కేసీఆర్ ఒంటరై ఓటమికి దగ్గరగా ఉన్నాడు. కేసీఆర్ వర్సెస్ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం... కేసీఆర్ వర్సెస్ సమస్త తెలంగాణ సమాజంగా మారింది. హిట్లర్ లాగా కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవాలి గానీ మనం చేసుకోవద్దు. కేసీఆర్ తప్పా అన్ని పార్టీలు మనకు మద్దతుగా ఉన్నాయి కాబట్టి కేసీఆర్‌ను ఓడగొట్టి వేరేవాళ్ళని గెలిపిద్దామ’ని మందకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను సాగనంపుదాం సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని బీజేపీ నాయకుడు జితేందర్‌రెడ్డి అన్నారు. స్వప్రయోజనాల కోసం ఆర్టీసీని వాడుకుని ఇప్పుడు ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన కోదండరాంను కూడా కేసీఆర్ పక్కనపెట్టేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో రక్షణ ఉంటుందని.. ఆర్టీసీ కార్మికులు స్టీరింగ్ కాదు సుదర్శన చక్రం తిప్పుతారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక వీధి లైట్స్ కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు జి. వివేక్ ఆరోపించారు. కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని, వారి ఉద్యమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. -
టీఆర్ఎస్కు వివేక్ గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్ : అనుకున్నట్లే జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ గడ్డం వివేక్ సోమవారం టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వనందుకు ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన ఆయన...ఇవాళ అధికారికంగా టీఆర్ఎస్ను వీడారు. కేసీఆర్ నమ్మకద్రోహం వల్లే తనకు టికెట్ రాలేదని, నమ్మించి గొంతు కోశారని వివేక్ ఆరోపణలు గుప్పించారు. తనకు టికెట్ ఇవ్వకుండా ఉండేందుకే చివరి వరకూ అభ్యర్థులను ప్రకటించలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చినా, ప్రోటోకాల్ మాత్రం పాటించలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు టీఆర్ఎస్లో అవమానాలే జరుగుతాయని వివేక్ విమర్శించారు. కాగా టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో వివేక్ బీజేపీలో చేరతారనే ప్రచారం గత రెండు రోజులుగా జరిగింది. అయితే ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన ధైర్యం చేయలేదు. దీంతో వివేక్ ఏకంగా లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చదవండి...(కేసీఆర్ నమ్మించి గొంతు కోశారు: వివేక్) సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా తదితరులు వివేక్‌తో సంప్రదింపులు జరిపినా ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. కాగా పార్టీ అభ్యర్థిగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు బయటకు వచ్చిన నేపథ్యంలో సెంటిమెంట్‌గా కూడా మరోసారి పార్టీలో చేరేందుకు వివేక్ ససేమిరా అన్నారట. (అన్న రాజకీయాల కోసం.. తమ్ముడి తప్పటడుగులు!) -
మాజీ ఎంపీ వివేక్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌కు మంగళవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పును సమర్ధించిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అప్పటి వరకు వివేక్ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగొద్దని తీర్పునిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్ అనర్హుడని ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి మార్చిలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేబినేట్ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ జి.వివేక్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ అప్పట్లో స్టే విధించింది. తీర్పును స్వాగతిస్తున్నాము : అజారుద్దీన్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తెలిపారు. వివేక్ ప్యానల్ ఎంపిక నిబంధనల ప్రకారం జరగలేదన్నారు. అంబడ్స్‌మెన్ వివేక్‌పై తీసుకున్న నిర్ణయమే నిజమైందన్నారు. తొలి నుంచి తాము వివేక్ ప్యానల్‌పై పోరాటం చేస్తున్నామని, చివరకు హెచ్‌సీఏలో న్యాయమే గెలిచిందని తెలిపారు. హెచ్‌సీఏలో ఏం జరగాలన్నది జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తారన్నారు. -
బీసీసీఐ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..!
సాక్షి, హైదరాబాద్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని, కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్‌ల ద్వారా వచ్చిన లాభాలతోనే సంస్థను నడిపిస్తున్నామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేక్ చెప్పుకొచ్చారు. మంగళవారం హెచ్‌సీఏ కార్యాలయంలో అంబుడ్స్‌మన్ సమావేశం జరిగింది. సమావేశం అజెండాలో ప్రధానాంశమైన సెక్రటరీ శేష్ నారాయణపై వేటు, భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు అవమానం తదితర విషయాలపై వివేక్ మీడియాతో మాట్లాడారు. రోజూ రాత్రి ఫోన్ చేస్తాడు : అవినీతి ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ కార్యదర్శి పోస్టు నుంచి సస్పెన్షన్‌కు గురైన శేష్ నారాయణ భవితవ్యంపై అంబుడ్స్‌మన్ కమిటీ చర్చించింది. అతనిపై హెచ్‌సీఏ పాలకమండలి విధించిన సస్పెన్షన్ సమర్థనీయమా, కాదా అనే విషయాన్ని అంబుడ్స్‌మన్ జస్టిస్ నర్సింహారెడ్డి నిర్ధారిస్తారు. కాగా, మంగళవారం నాటి భేటీ తుది నిర్ణయం ప్రకటించకుండానే ముగిసింది. శేష్ నారాయణ సస్పెన్షన్‌పై తీర్పు జనవరి 20కి వాయిదా పడింది. ఇదిలాఉంటే సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న శేష్ నారాయణ మంచి మిత్రుడని హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ అన్నారు. ‘రోజూ రాత్రి 11 గంటలకు శేష్ నాకు ఫోన్ చేస్తాడ’ని తెలిపారు. అందుకే అజార్‌ను రానివ్వలేదు : భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ను హెచ్‌సీఏ ఆఫీసులోకి రానీయకుండా అడ్డుకున్న వ్యవహారం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై వివేక్ వివరణ ఇచ్చారు. ‘‘నేషనల్ క్రికెట్ క్లబ్ కార్డు చూపించమని అడిగితే అజార్ చూపించలేదు. ఆయన వైస్ ప్రెసిడెంట్లుగా కనీసం రికార్డుల్లోకూడా లేదు. అందుకే అతన్ని హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించలేదు. అయితే అజార్ సేవలను వినియోగించుకునేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. క్రికెట్లో సమస్యలు చెప్పాలని ఆయనను కోరాం’’ అని వివేక్ వివరించారు. ‘‘క్రికెట్లో ఎ, బి, సి, డిలు కూడా తెలియని వ్యక్తులు హెచ్‌సీఏకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు’ అని వివేక్‌పై అజారుద్దీన్ మండిపడిన సంగతి తెలిసిందే. క్రికెట్‌ను ఎవరైనా నడిపించొచ్చు : క్రికెట్ కమిటీల విషయంలో జస్టిస్ లోథా కమిటీ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కాగా అమలుచేస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్ చెప్పారు. బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు నిధులు రాలేదని, ఐపీఎల్ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన లాభాలతోనే బండిని నడిపిస్తున్నామన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)తో హెచ్‌సీఏకి ఎలాంటి విబేధాలు లేవని, క్రికెట్‌ను ఎవరైనా నడిపించుకోవచ్చని, అయితే హెచ్‌సీఏకు పోటీ సంఘాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని బీసీసీఐ స్పష్టం చేసిందని వివేక్ తెలిపారు. -
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి.వివేక్ (వివేకానంద్) ఘన విజయం సాధించారు. జనవరి 17న అధ్యక్ష ఎన్నికలు జరగ్గా... మొత్తం 216 ఓట్లకుగాను..206 ఓట్లు పోలయ్యాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరి గింది. ఈ ఎన్నికల్లో వివేక్ ప్యానల్ ఘన విజయం సాధించింది. అధ్యక్ష స్థానానికి పోటీచేసిన డాక్టర్ వివేక్‌కు 136 ఓట్లు రాగా... ఆయన సమీప ప్రత్యర్థి విద్యుత్ జయసింహకు 68 ఓట్లు దక్కాయి. వివేక్ 68 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. మరో రెండు ఓట్లు చెల్లలేదు. ఇక ఉపాధ్యక్షునిగా ఎన్నికైన అనిల్ కుమార్‌కు 138 ఓట్లు లభించగా... సమీప అభ్యర్థి ఇమ్రాన్ మహమూద్ 86 ఓట్లు దక్కాయి. సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన అఫ్జల్ అసద్‌కు 124 ఓట్లు లభించగా... ఆయన సమీప ప్రత్యర్థి వంకా ప్రతాప్‌కు 80 ఓట్లు దక్కాయి. కోశాధికారిగా ఎన్నికై న మహేంద్రకు 148 ఓట్లు దక్కగా... సమీప ప్రత్యర్థి అనురాధకు 54 ఓట్లు వచ్చాయి. కమిటీ సభ్యులుగా ఎన్నికైన హన్మంత్ రెడ్డికి 100 ఓట్లు లభించాయి. కాగా హెచ్‌సీఏ కార్యదర్శిగా ఎన్నికైన శేష్‌నారాయణ గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కౌంటింగ్ సందర్భంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధ్యక్షునిగా ఎన్నికైన వివేక్ మాట్లాడుతూ...హెచ్‌సీఏకు మంచిరోజులు వచ్చాయన్నారు. అవినీతిలేని పా లనను అందిస్తామని, క్రికెట్‌ను మారుమూల గ్రామాల్లో కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో హెచ్‌సీఏను విస్తరిస్తామన్నారు. -
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్ విజయం
హైదరాబాద్: క్రీడావర్గాల్లో ఉత్కంఠరేకెత్తించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల ఫలితాలు శుక్రవారం రాత్రి వెలువడ్డాయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి. వివేక్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా విజయం సాధించారు. వికేవ్కు మొత్తం 136 ఓట్లురాగా, ఆయన ప్రత్యర్థి విద్యుత్ జయసింహకు కేవలం 68 ఓట్లు పడ్డాయి. వికేవ్ గెలుపుతో ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. హెచ్‌సీఏ పాలకమండలికి జనవరిలోనే ఎన్నికలు జరిగినప్పటికీ, కోర్టు ఉత్తర్వుల మేరకు అధ్యక్ష ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన సివిల్ రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి. భట్ కొట్టివేస్తూ గురువారం ఆదేశాలు జారీచేయడంతో శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. -
కేసీఆర్ అబద్ధాలకోరు: పొన్నం
కాటారం(కరీంనగర్ జిల్లా): అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరని మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్ విమర్శించారు. గురువారం కరీంనగర్ జిల్లా కాటారంలో వివాహానికి హాజరైన వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి విఫలమయ్యారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో లేనిపోని హామీలను కురిపిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ స్వలాభం కోసమే మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలకు రూపకల్పన చేశారన్నారు. ఖరీఫ్ సమయం దగ్గర పడుతోందని, చెరువుల పనులు ఎప్పుడు పూర్తి పంటలకు నీళ్లందిస్తారని ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ వరకు ఎన్ని చెరువులు పూర్తి చేసి, ఎన్ని ఎకరాలకు నీరందిస్తారన్న లెక్కలను రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం పూటకో ధోరణి అవలంబిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ గొప్పతనాన్ని పాఠ్యాంశాల్లో చేర్చకపోవడం శోచనీయమన్నారు. ఈ ఏడాది నుండి కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయడంతోపాటు దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయూలన్నారు. -
'పార్టీ మారను... కాంగ్రెస్‌లోనే కొనసాగుతా'
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆ పార్టీ మాజీ ఎంపీ జి.వివేక్ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం వివేక్ విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలే అని అన్నారు. తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి మెమోరియల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారని వివేక్ తెలిపారు. తన తండ్రి వెంకట స్వామి మెమోరియల్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించినందుకు వివేక్ ఈ సందర్భంగా కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
రాహుల్‌గాంధీని కలసిన మాజీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, సిరిసిల్ల రాజయ్య, సురేష్ షెట్కార్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఎన్డీయే కూటమి ఆరు నెలల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా రాహుల్ మాజీ ఎంపీలకు సూచించారు. -
వంద కోట్లపై... వంద కేసులదే విజయం
తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ సృష్టిస్తున్న ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు ఘోర పరాజయాన్ని చవిచూశారు. పార్లమెంట్ లోని సంపన్న ఎంపీల్లో ఒకరైన జి. వివేక్ గులాబీ దళం ధాటికి చిత్తయ్యారు. పెద్దపల్లి పార్లమెంట్ లో అనామకుడిగా బరిలొ దూకిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత బాల్క సుమన్ .. ఎంపీ జి. వివేక్ ను మట్టికరిపించారు. తెలంగాణ ఉద్యమ వనంలో మొలచిన గులాబీ మొక్క బాల్క సుమన్ రూపంలో తొలిసారి పార్లమెంట్ అడుగుపెట్టనుంది. పెద్దపల్లి పార్లమెంటరీ స్థానంలో బాల్క సుమన్ ప్రచారంలోనే ఆకట్టుకున్నారు. వంద కోట్ల ఆస్తులతో వివేక్.. వందలాది కేసులతో తాను పెద్దపల్లి బరిలోకి దూకామనే వ్యాఖ్యలతో బాల్క సుమన్ ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రచారంలో భాగంగా పూరి గుడిసెల్లో, తండాల్లో తిండి, నిద్రతో ఓటర్లకు చేరువయ్యారు. బాల్క సుమన్ ప్రచారంలో వందలాది ఓయూ విద్యార్ధులు, స్థానిక యువత పాలుపంచుకున్నారు. బాల్క సుమన్ ప్రచారాన్ని చూసి పెద్దపల్లి నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన జి.వివేక్ కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ప్రచారంలో ఆకట్టుకోవడానికి వివేక్ చేసిన ప్రయత్నాలు.. సుమన్ ప్రచారం ముందు వెలవెలపోయాయి. సామాన్య ప్రజల్లో తాను ఒక్కడిననే అంశాన్ని ఓటర్లలో సుమన్ కలిగించిన తీరే ఆయనకు విజయం సాధించిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎదురించి టీఆర్ఎస్ పార్టీలో వివేక్ చేరారు. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న వివేక్ .. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర ఏర్పాటులో తన పాత్రతో ఓటర్లపై ప్రభావం చూపలేకపోవడం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎదురుగాలి వీయడం లాంటి అంశాలు వివేక్ ప్రతికూలంగా మారాయనే వాదన వినిపిస్తోంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో వందలాది కేసులు, జైలు జీవితాన్ని అనుభవించిన బాల్క సుమన్ ను ఓటర్లు అక్కున చేర్చుకున్నారనే వాదన పెద్దపల్లిలో బలంగా వినిపిస్తోంది. ప్రజల, ఆదరాభిమానాల ముందు వంద కోట్లు, మీడియా ప్రచారం కూడా దిగదుడుపేనని బాల్క సుమన్ విజయం నిరూపించిదని చెప్పవచ్చు. -
సీఎం రేసులో లేను: ఎంపీ వివేక్
మంథని: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాను ముఖ్యమంత్రి రేసులో ఉంటాననే ప్రచారం అవాస్తవమని ఎంపీ జి.వివేక్ తెలిపారు. సీఎం పదవి కోసమే తాను టీఆర్ఎస్లో చేరినట్లు ప్రచారం చేస్తున్నారని, పదవుల కోసం ఏనాడూ ఆరాటపడ లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మంథనిలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులు త్యాగం చేసిన వారిని తెలంగాణ ఫ్రీడం ఫైటర్స్‌గా గుర్తించాలని అన్నారు. ఈ విషయమై రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొలువుదీరే ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూ ఎన్నోసార్లు పదవీ త్యాగం చేసిన కేసీఆర్ లాంటి వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉద్యమంలో సరైన సమయంలో త్యాగం చేస్తేనే ఫలితం లభిస్తుంది కానీ.. స్వప్రయోజనాల కోసం చేస్తే త్యాగాలు చేస్తే లాభం ఉండదని మంత్రి శ్రీధర్‌బాబు నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు. -
శ్రీధర్‌బాబుది నీతిమాలిన రాజకీయం
మంథని, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏనాడూ పనిచేయని మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తపనపడడం ఆయన నీతిమాలిన రాజకీయానికి నిదర్శనమని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ ధ్వజమెత్తారు. మంథని నియోజకవర్గంలో జై తెలంగాణ అన్న వారిపైన అక్రమ కేసులు పెట్టించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సీమాంధ్ర సీఎంకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉద్యమకారుల ఉసురుపోసుకున్న మంత్రి ఇప్పుడవన్నీ విస్మరించి సీఎం కావాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వివేక్ శనివారం మంథని నియోజకవర్గంలోని అన్ని మండల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పలుచోట్ల పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశాలు నిర్వహించడంతోపాటు వివిధ పార్టీల నుంచి శ్రేణులను చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తె లంగాణకు మొదటి నుంచి టీడీపీ, కాంగ్రెస్ ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. సీఎం జి.వివేక్తెలంగాణ ద్రోహి అని, ఉద్యమంలో పాల్గొంటున్నానే అక్కసుతో తనను అనేక రకాలుగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి నిధులన్నీ చిత్తూరు జిల్లాకు దోచుకెళ్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ పన్నెండేళ్లపాటు పోరాడి సాధించిన తెలంగాణను దళారుల, కబ్జాకోరుల చేతుల్లో పెట్టడానికి కాదని, రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ పాత్ర కీలకం అని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్రులు హైదరాబాద్‌ను దోపిడీ చేయడానికే గ్రేటర్ హైదరాబాద్, మెట్రోపాలిటన్ సిటీగా మార్చారన్నారు. చంద్రబాబు ైహైటెక్సిటీ పేరుతో వేల ఎకరాలు తన అనుయాయులకు కట్టబెట్టాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనాన్ని ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారని శ్రీధర్‌బాబునుద్దేశించి విమర్శించారు. ఉద్యమం తీవ్రత లేదంటూ ముఖ్యమంత్రికి చెంచాగిరి చేసి కొయ్యూరులో రచ్చబండ కార్యక్రమం పెట్టించిన మంత్రి సీఎం కావాలని కలలు కనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. -
సీఎం కిరణ్ అబద్ధాల కొరియర్: వివేక్
మంచిర్యాల: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు నిత్యం అడ్డుపడుతూ అబద్ధాల కొరియర్‌గా వ్యవహరిస్తున్నాడని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రానికి తప్పుడు నివేదికలిస్తూ ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. మూడు ప్రాంతాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన ఆయన కేవలం సీమాంధ్రకే సీఎంగా పని చేస్తున్నారని అన్నారు. సీడబ్ల్యూసీ, కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినా అందుకు విరుద్ధంగా సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాలకు ఆజ్యం పోస్తున్నాడని ఆరోపించారు. సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమాల్లోకి వెళ్లాలని సూచించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఎంను కేంద్రం తక్షణమే బర్తరఫ్ చేయాలని కోరారు. ఇక జీవోఎంకు కేసీఆర్, కేశవరావులతోపాటు తాను కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను, అమరుల త్యాగాలను 60 ఏళ్లుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరించి, నివేదిక ఇచ్చామని చెప్పారు. అహింసా మార్గంలో తెలంగాణ ప్రజలు ఉద్యమించారని, సీమాంధ్రులు కూడా ఆనాడు మద్రాసు నుంచి తరిమికొట్టించుకున్న పరిస్థితులు మళ్లీ తెచ్చుకోవద్దని, అన్నదమ్ముల్లా విడిపోయేందుకు సహకరించాలని ఎంపీ వివేక్ కోరారు.