మంథని, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏనాడూ పనిచేయని మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తపనపడడం ఆయన నీతిమాలిన రాజకీయానికి నిదర్శనమని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ ధ్వజమెత్తారు. మంథని నియోజకవర్గంలో జై తెలంగాణ అన్న వారిపైన అక్రమ కేసులు పెట్టించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సీమాంధ్ర సీఎంకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉద్యమకారుల ఉసురుపోసుకున్న మంత్రి ఇప్పుడవన్నీ విస్మరించి సీఎం కావాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
వివేక్ శనివారం మంథని నియోజకవర్గంలోని అన్ని మండల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పలుచోట్ల పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశాలు నిర్వహించడంతోపాటు వివిధ పార్టీల నుంచి శ్రేణులను చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తె లంగాణకు మొదటి నుంచి టీడీపీ, కాంగ్రెస్ ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. సీఎం జి.వివేక్తెలంగాణ ద్రోహి అని, ఉద్యమంలో పాల్గొంటున్నానే అక్కసుతో తనను అనేక రకాలుగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి నిధులన్నీ చిత్తూరు జిల్లాకు దోచుకెళ్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ పన్నెండేళ్లపాటు పోరాడి సాధించిన తెలంగాణను దళారుల, కబ్జాకోరుల చేతుల్లో పెట్టడానికి కాదని, రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ పాత్ర కీలకం అని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్రులు హైదరాబాద్‌ను దోపిడీ చేయడానికే గ్రేటర్ హైదరాబాద్, మెట్రోపాలిటన్ సిటీగా మార్చారన్నారు. చంద్రబాబు ైహైటెక్‌సిటీ పేరుతో వేల ఎకరాలు తన అనుయాయులకు కట్టబెట్టాడని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనాన్ని ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారని శ్రీధర్‌బాబునుద్దేశించి విమర్శించారు. ఉద్యమం తీవ్రత లేదంటూ ముఖ్యమంత్రికి చెంచాగిరి చేసి కొయ్యూరులో రచ్చబండ కార్యక్రమం పెట్టించిన మంత్రి సీఎం కావాలని కలలు కనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
శ్రీధర్‌బాబుది నీతిమాలిన రాజకీయం
Published Sun, Dec 15 2013 3:19 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement