సీఎం కిరణ్ ప్రయత్నాలు ఫలించవు: శ్రీధర్ బాబు
రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ అవసరం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అసెంబ్లీలో చర్చించేందుకు రాష్ట్రపతి ఇచ్చిన గడువును సీమాంధ్ర ఎమ్మెల్యేలు సరిగా వినియోగించుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకున్న అంశం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలుసని చెప్పారు.
టి.బిల్లుపై చర్చ గడువు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగానే చర్చను ముగించాలని వ్యాఖ్యానించారు. సూచనలు,అభిప్రాయాలు చెప్పాలనే.. విభజన బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీకి పంపారని శ్రీధర్‌బాబు చెప్పారు. తన నుంచి శాసన సభ వ్యవహారాల శాఖను తప్పించడానికి నిరసనగా శ్రీధర్ బాబు ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.