'పార్టీ మారను... కాంగ్రెస్లోనే కొనసాగుతా'
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆ పార్టీ మాజీ ఎంపీ జి.వివేక్ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. అనంతరం వివేక్ విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలే అని అన్నారు. తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి మెమోరియల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ను కోరినట్లు చెప్పారు.
ఈ మేరకు ఆయనకు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారని వివేక్ తెలిపారు. తన తండ్రి వెంకట స్వామి మెమోరియల్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించినందుకు వివేక్ ఈ సందర్భంగా కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.