
సాక్షి, ముంబై: ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్ కొత్త సంవత్సరం సందర్భంగా తన అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. ప్రముఖ మ్యాగజీన్ జీక్యూ ఇండియా జనవరి ఎడిషన్ కవర్‌పేజీపై ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్ దేశవ్యాప్తంగా సూపర్‌స్టార్ అయ్యాడు. దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరువయ్యాడు. ఈ నేపథ్యంలో న్యూఇయర్ తొలి ఎడిషన్‌లోనే ప్రభాస్ ముఖచిత్రంతో జీక్యూ మ్యాగజీన్ కథనాన్ని ప్రచురించింది.
బ్లూపిన్ స్ట్రిప్‌డ్ త్రిపీజ్ సూట్‌తో కాలు మీద కాలు వేసుకొని రాయల్ లుక్‌తో ప్రభాస్ కవర్‌పేజీకి పోజు ఇచ్చాడు. ‘సంచలన విజయం సాధించిన ’బాహుబలి’ స్టార్ ప్రభాస్ ఆశ్చర్యకరంగా ఒక సిగ్గరి. 2018లో రాబోయే మా మొదటి ఎడిషన్‌లో ఆయన గురించి కొన్ని విశేషాలు మేం అందించబోతున్నాం. జనవరి 2018 ఎడిషన్‌ను మిస్ కాకండి’ అంటూ జీక్యూ మ్యాగజీన్ ట్విట్టర్‌లో పోస్టుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment