Renu Desai Appreciates SS Rajamouli For Making Baahubali Movie, Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Renu Desai Comments On Baahubali: ఇది ఒక అద్భుతమైన అనుభవం: రేణు దేశాయ్

Published Sat, Aug 19 2023 4:00 PM | Last Updated on Sat, Aug 19 2023 4:40 PM

Renu Desai Appreciates SS Rajamouli For Making Bahubali Movie - Sakshi

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ఆమె చేసిన కామెంట్స్‌తో మరోసారి చర్చల్లో నిలిచారు. ఎందుకంటే కొద్దిరోజుల క్రితమే తన విడాకుల విషయం, పవన్‌ గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె దర్శకధీరుడు రాజమౌళిపై చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: నా విషయంలో పవన్‌ది 100% తప్పే: రేణుదేశాయ్‌)

అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని నార్వోలోని స్టావెంజర్ నగరంలోని ఓ థియేటర్‌లో ప్రదర్శించారు. అక్కడ సినిమా చూసేందుకు రేణ్ దేశాయ్, తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె థియేటర్‌లో సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన లయ.. దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు.  

రేణు తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఒక భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం చాలా అద్భుతంగా ఉంది. రాజమౌళి సార్.. మీరు ప్రేక్షకుల కోసం సృష్టించిన అనుభూతిని వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు. స్టావెంజర్‌లోని థియేటర్‌లో బాహుబలి చూసిన అనుభవం మరిచిపోలేనిది. ఈ కార్యక్రమానికి నన్ను, అకీరాను ఆహ్వానించినందుకు శోబు సార్‌కు  ధన్యవాదాలు.'  అంటూ పోస్ట్ చేసింది.  అద్భుతమైన లైవ్ ఆర్కెస్ట్రాతో మనం అత్యంత ఇష్టపడే చిత్రాన్ని చూడటం అద్భుతంగా ఉందంటూ రేణుదేశాయ్ ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్‌ వైరల్‌ కామెంట్స్‌ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement