
మైసూరు (శ్రావణ బెళగొళ): కర్ణాటకలోని హాసన్ జిల్లా శ్రావణ బెళగొళలో బాహుబలి 88వ మహామస్తకాభిషేకాల్లో ప్రధాన ఘట్టమైన అభిషేకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. 12 ఏళ్లకోసారి నిర్వహించే మహామస్తకాభిషేకాన్ని చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య పవిత్రజలంతో బాహుబలిని అభిషేకించారు. అనంతరం జైన మునులు, భక్తులు బిందెలలోని పవిత్ర జలాలతో విగ్రహాన్ని అభిషేకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీఎం హోదాలో మహామస్తకాభిషేకాల్లో తొలిసారి పాల్గొన్నాననీ, ఇది తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని సీఎం వ్యాఖ్యానించారు.