Siddharamaiah
-
సాక్షి లేటెస్ట్ కార్టూన్: 27-09-2024
-
సిద్దరామయ్యకు స్లీపింగ్ కష్టాలు
-
సీఎంకు చేతబడి..!
-
హనుమాన్ జెండా తొలగింపు వివాదం.. మాండ్యా జిల్లాలో ఉద్రిక్తత
బెంగళూరు: హనుమాన్ జెండా తొలగింపుపై కర్ణాటక మాండ్యా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రాణప్రతిష్ట తర్వాత ధ్వజస్తంభంపై జెండా తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఇందుకు గ్రామస్థులు అంగీకరించకపోవడంతో వివాదం చెలరేగింది. జెండా తొలగించే ప్రసక్తే లేదని గ్రామస్థులు భీష్మించుకుని కూర్చోవడంతో ఎట్టకేలకు అధికారులు విరమించారు. గ్రామ పంచాయతీ అనుమతితో కెరగోడు గ్రామంలో గ్రామస్థులు 108 అడుగుల ధ్వజస్తంభంపై హనుమాన్ జెండాను ఎగరవేశారు. ఇందుకు సమీప 12 గ్రామాల ప్రజల నుంచి నిధులు సమీకరించారు. ధ్వజస్తంభంపై హనుమాన్ జెండా ప్రాణప్రతిష్ట కూడా పూర్తి అయ్యాక తొలగించాలని అధికారులు ఆదేశించారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా ఎగురవేసిన ప్రదేశం గ్రామ పంచాయతీ భవనం పరిధిలోకి వస్తుందని, ఆ జెండాను తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు నేడు గ్రామంలోకి వచ్చి ఆ జెండాను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసుల లాఠీఛార్జీ చేశారు. అధికారుల చర్యకు వ్యతిరేకంగా నిరసనకారులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ వివాదంపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఆ ప్రదేశంలో హనుమాన్ జెండాను ఎగురవేయడం సరికాదని చెప్పారు. బీజేపీ, జేడీఎస్‌ల కుట్రపూరిత చర్యగా ఆయన ఆరోపించారు. జిల్లా ఇంఛార్జీ చెలువరాయస్వామి ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. జెండా ఎగురవేసిన ప్రదేశం పంచాయతీ భవనం ప్రదేశం పరిధిలోకి వస్తుందని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు. ప్రైవేటు ప్రదేశంలో హనుమాన్ జెండా ఎగురవేయాలని కోరారు. ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ -
పని చేయలేకున్నాం బాబోయ్.. మంత్రులపై సీఎంకు ఎమ్మెల్యేల లేఖలు..
బెంగళూరు: ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా మూడు నెలలు గడవక ముందే కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం పట్టిందా..? బయటకు నేరుగా వెల్లడించకపోయినా.. నేతల్లో అసమ్మతి సెగలు రగులుతున్నాయా? సొంత నియోజకవర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని 30 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మొరపెట్టుకున్నారా?.. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఈ పుకార్లలో వాస్తవం లేదని చెబుతున్నా.. తాజా పరిణామాలు ఇవన్నీ నిజమేనా? అనే సందేహాలను కల్గిస్తున్నాయి. కర్ణాటకాలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. దేశవ్యాప్తంగా నీరుగారుతున్న కాంగ్రెస్ ఆశల్ని పైకిలేపింది. సిద్ధరామయ్య నేతృత్వంలో చక్కగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య పీఠం అధిష్ఠించగానే ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ శ్రేయోరాజ్య స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచిందో లేదో.. ప్రభుత్వం కూలిపోనుందా? అనే పుకార్లు పుట్టాయి. పార్టీ నేతల్లో అసమ్మతి సెగలు కమ్ముకున్నట్లు వార్తలు వచ్చాయి. సొంత నియోజక వర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని 30 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మొరపెట్టుకున్నారని ఊహాగానాలు వచ్చాయి. దానికి తోడు తమ ప్రభుత్నాన్ని కూల్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేయడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అటు.. అభివృద్ధి పనులకు మంత్రులు సహకరించడం లేదని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. సీఎంను ఎలా కిందకు దించాలో తనకు తెలుసంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు.. ప్రభుత్వంలో నేతల మధ్య సఖ్యత దెబ్బతిందనే ఆరోపణలకు బలం చేకూర్చాయి. ఇదీ చదవండి: HD Deve Gowda: జేడీఎస్ భవిష్యత్‌పై పార్టీ అధినేత దేవె గౌడ కీలక వ్యాఖ్యలు.. అయితే ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని సీఎం సిద్ధరామయ్య తాజాగా స్పష్టం చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు తనకు అసమ్మతి లేఖలు పంపలేదని వెల్లడించారు. ఈ వారం పార్టీ అసెంబ్లీ సభ్యుల సమావేశం ఉంటుందని చెప్పారు. గత వారం జరగాల్సిన మీటింగ్ పలు కారణాల వల్ల వాయిదాపడినట్లు చెప్పారు. అటు డీకే శివకుమార్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేల మధ్య సయోద్యతో పాటు ప్రభుత్వ అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు చెప్పారు. మంత్రులపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బెంగళూరుకు బయట కుట్ర జరుగుతోందని డీకే శివకుమార్ వ్యాఖ్యలపై స్పందించడానికి సిద్ధరామయ్య నిరాకరించారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఎదురవుతున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల అమలుకు పలు నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఒక్క తన నియోజక వర్గంలోనే రూ.300 కోట్ల వరకు అవసరమవుతున్నట్లు చెప్పారు. పథకాలను అలాగే కొనసాగించాలని ఎమ్మెల్యేలు కోరుతున్న విషయాన్ని డీకే తెలిపారు. అయితే.. ఈ విషయాలను మరిచి ప్రజలతో మమేకమై నేతలు ఉండాలని సూచించినట్లు డీకే తెలిపారు. వర్షాలు, వరదల్లో ప్రజలకు తోడుగా ఉండాలని చెప్పినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్ఎఫ్.. -
చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
బెంగళూరు: కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సహా ఇతర ఎమ్మెల్యేలు చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. బీజేపీ గత బడ్జెట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, 2018 మేనిఫెస్టోను కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సీఎం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను 'కివిమెలెహూవ'గా అభివర్ణించారు. అంటే ప్రజలను ఫూల్స్ చేస్తోందని అర్థం. Congress MLAs in Karnataka attended budget session with flower on their ears as a mark of protest. They call it Kivi mele hoova protest. pic.twitter.com/Kx5kdIrbrQ — Nagarjun Dwarakanath (@nagarjund) February 17, 2023 సీఎం బొమ్మై ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేశారని ప్రతిపక్షనేత సిద్ధరామయ్య ఆరోపించడం సభలో ఉద్రిక్తతకు దారితీసింది. సభ్యులు శాంతియుతంగా వ్యవహరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు వెనక్కితగ్గకుండా నిరసనలు కొనసాగించారు. సీఎం మాత్రం యథావిధిగా బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగించారు. రామనగరలో రామ మందిరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య తరచూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కమలం పార్టీ గత ఎన్నికల్లో 600 హామీలు ఇస్తే వాటిలో 10 శాతం మాత్రమే అమలు చేసిందని ధ్వజమెత్తారు. చదవండి: అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్ -
కానిస్టేబుల్‌ను చెంపపై కొట్టిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
-
కానిస్టేబుల్‌ను చెంపపై కొట్టిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
సాక్షి, రాయచూరు రూరల్ (కర్ణాటక): మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డిని అరెస్ట్ చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర న్యాయ సలహాదారుడు రామన్న డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఇటీవల జరిగిన ఓ ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశారని, ఈ ఘటన జరిగిన ఐదు రోజులు గడుస్తున్నా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు . కాంగ్రెస్ లీడర్ సిద్ధరామయ్య ఆధ్వర్యంలో నవంబరు 3న జరిగిన నిరసన కార్యక్రమంలో సదరు మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి రెచ్చిపోయాడు. ఏకంగా .. కానిస్టేబుల్ రాఘవేంద్రను పట్టుకుని దూశించాడు. అంతటితో ఆగకుండా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే ఎమ్మెల్యేపై తగిన చర్యలు కోవాలని రామన్న అధికారులను కోరారు. చదవండి: పోలీసుల టార్చర్.. పురుగుల మందు తాగి ఐదుగురు మృతి.. -
అసెంబ్లీలో అవిశ్వాస రణం
సాక్షి, బెంగళూరు: అవిశ్వాస తీర్మానాన్ని అమలు చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, కరోనా వైరస్ వల్ల సాధ్యపడదని అధికార బీజేపీ ఎమ్మెల్యేల పట్టుతో శనివారం విధానసభ వేడెక్కింది. యడియూరప్ప ప్రభుత్వం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ఆయన మంత్రివర్గం.. సభలో విశ్వాసం నిరూపించుకోవాలని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య నోటీసులు ఇచ్చారు. సభాపతి విశ్వేశ్వరహెగడేకాగేరి మాట్లాడుతూ చాలామంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి సభకు రాని కారణంగా ఓటింగ్ నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు. (సీనియర్ల అసంతృప్తి.. సీఎంను తప్పించండి) కరోనా సోకిన సభ్యులు పీపీఈ కిట్లు ధరించి వచ్చినా అనుమతి కష్టమే అన్నారు.రాజకీయం, అధికారం కంటే మానవీయ కోణంలో ఆలోచించాలని అన్నారు. ఈ నేపథ్యంలో మూజువాణి ద్వారా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. సీఎం యడియూరప్ప చర్చను చూస్తూ ఉండిపోయారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ సామాజిక బాధ్యత తమకూ ఉందని.. మూజువాణి ఓటుకు అంగీకరిస్తున్నామన్నారు. అనంతరం సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు సభాపతి విశ్వేశ్వర హెగడే కాగేరి ప్రకటించారు. ఈ నెల 28వ తేదీన రైతుసంఘాలు జరిపే బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు సిద్ధు తెలిపారు. ఎస్పీ బాలుకు నివాళి దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి ఉభయ సభల్లో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్పీ బాలుకు కర్ణాటకతో ఉన్న అనుబంధం గురించి సభ్యులు కొనియాడారు. -
ఉప ఎన్నికల్లో బీజేపీ విజయభేరి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 సీట్లను కమలం పార్టీ గెల్చుకుంది. రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ రెబల్ విజయం సాధించారు. డిసెంబర్ 5న ఎన్నికలు జరగగా, ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఈ విజయంతో రాష్ట్రంలో యడియూరప్ప ప్రభుత్వం మెజారిటీ మార్క్‌ను సొంతంగా సాధించుకున్నట్లైంది. అసెంబ్లీలో మొత్తం 225 (ఒక నామినేటెడ్సహా) సీట్లు కాగా, రెండు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 223 స్థానాలకు 112 మెజారిటీ మార్క్. ప్రస్తుతం ఉన్న 105 స్థానాలకు తాజా విజయంతో మరో 12 సీట్లను బీజేపీ కలుపుకుంది. దాంతో, అసెంబ్లీలో బీజేపీ బలం 117కి చేరుకుని, మెజారి టీ మార్క్‌ను సునాయాసంగా దాటేసింది. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఘోర పరాజయాన్ని మిగిల్చాయి. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు గుండూరావు తమ పదవులకు రాజీనామా చేశారు. శివాజీనగర, హణసూరు నియోజకవర్గాల్లో మినహాయించి మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. శివాజీనగర్‌లో రిజ్వాన్ అర్షద్, హణసూరు లో మంజునాథ్‌లు గెల్చారు. హొసకోటలో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి శరత్ గెలుపొందారు. జేడీఎస్ అభ్యర్థులు పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఉప ఎన్నికలు జరిగిన ఈ 15 సీట్లలో 12 కాంగ్రెస్‌వే. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 15 సీట్లకు గానూ.. 12 స్థానాల్లో కాంగ్రెస్, 3 సీట్లలో జేడీఎస్ గెలుపొందాయి. ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఈ ఎన్నికల్లో మెజారిటీని ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు యడియూరప్ప కృతజ్ఞతలు తెలిపారు. మిగతా మూడున్నరేళ్లు సుస్థిర, ప్రగతిశీల పాలన అందిస్తానన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తానన్న హామీ విషయంలో వెనక్కు వెళ్లబోనన్నారు. ప్రస్తుతం, ముఖ్యమంత్రి సహా కేబినెట్లో 18 మంది మంత్రులున్నారు. మంత్రిమండలిలో మొత్తం 34 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది. వెన్నుపోటుదారులకు మద్దతిచ్చారు ఉప ఎన్నికల ఫలితాలపై బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ‘అభినందనలు కర్ణాటక. వెన్నుపోటు పొడిచే వ్యక్తులు మళ్లీ ముందుకు వచ్చారు. వారే మీకు తిరుగుబాణం అవుతారని ఆశిస్తున్నాను. అనర్హులకు మద్దతు ఇచ్చారు, మంచిది’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల గెలుపు కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, బీజేపీకి మద్దతివ్వడంతో, ఈ జూలై నెలలో జేడీఎస్ నేత కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ 17 మందిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. జూలై 29న యడియూరప్ప అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూనే, ఆ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే చాన్సిచ్చింది. మస్కి, ఆర్ఆర్ నగర్ స్థానాలకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఆ స్థానాలను మినహాయించి, 15 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్, జేడీఎస్‌లపై తిరుగుబాటు చేసి తమ పార్టీలో చేరి, అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో 13 మందిని బీజేపీ పోటీలో నిలపగా 11 మంది గెల్చారు. -
ప్రజా తీర్పును గౌరవిస్తూ సిద్ధూ రాజీనామా
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎల్పీ పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే తాను సీఎల్పీ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా శాసనసభ ప్రతిపక్ష హోదా పదవికి కూడా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 13 స్థానాలను కైవం చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో నాలుగు నెలల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న అనర్హత ఎమ్మెల్యేల వ్యవహారం ఎన్నికల ఫలితాలతో ముగిసింది. చదవండి: ‘కన్నడ నాట ఇక సుస్థిర సర్కార్’ -
వెనక్కి తగ్గని బీజేపీ రెబల్స్
బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా ముగిసింది. అనుకున్నట్లుగానే ఇద్దరు జేడీఎస్ అభ్యర్థులు తెల్లజెండా ఊపారు. ఇద్దరు బీజేపీ రెబెల్స్ వెనక్కి తగ్గలేదు. శివాజీనగరలో అత్యధికంగా 19 మంది పోటీలో నిలిచారు. ప్రచారం, ప్రలోభాల పర్వం మిన్నంటబోతోంది. సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 5న జరగనున్న ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. ఇప్పటివరకు రెబెల్స్ అభ్యర్థులను బుజ్జగించడం, నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసిన పార్టీలు శుక్రవారం నుంచి ప్రచార బరిలో దిగనున్నారు. జేడీఎస్ పారీ్టకి పెద్ద షాక్ తగిలింది. హీరేకరూర్, అథని నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హావేరి జిల్లా హీరేకరూర్‌లో అభ్యర్థి శివలింగ శివాచార్య స్వామిజీ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అథణిలో ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది జరిపిన చర్చల తర్వాత జేడీఎస్ అభ్యర్థి గురుదాస్యల్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక బీజేపీ రెబెల్స్ శరత్ బచ్చేగౌడ (హొసకోటె), కవిరాజ్ అరస్ (హొసపేటె)లు వైదొలగకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చివరకు 15 స్థానాలకు 165 మంది రంగంలో మిగిలారు. నేటి నుంచి దూకుడు శుక్రవారం నుంచి సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రులు డీవీ సదానందా గౌడ, సురేశ్ అంగడి, ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్‌కటీల్‌లు ప్రచారంలోకి దిగనున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి సిద్ధరామయ్య, జేడీఎస్ నుంచి కుమారస్వామిలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. దేవెగౌడ కూడా నేటి నుంచి ప్రచారం చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మనుగడకు ఎంతో కీలకమైన ఈ ఎన్నికలను బీజేపీ, ప్రతిపక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కదనరంగంలోకి దిగాయి. అత్యధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనే బీజేపీ ఆరాటం అయితే అనర్హత ఎమ్మెల్యేలను ఓడించడంతో పాటు ప్రభుత్వాన్ని కూలదోల్చడం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రణాళికలు రచిస్తున్నాయి. శివాజీనగరలో 19 మంది పోటీ: సీఈవో మొత్తం 15 నియోజకవర్గాల్లో 37,77,970 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సంజీవ్ కుమార్ తెలిపారు. నామినేషన్లు ముగిసే నాటికి మొత్తం 165 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గురువారం మొత్తం 53 మంది ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా శివాజీనగరలో 19 మంది, అత్యల్పంగా కేఆర్ పేట, యల్లాపుర ఏడుగురు చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా, డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా, 9వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సన్నాహాలను చేపట్టింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై సిబ్బందికి అవగాహన తరగతులను గురువారం బెంగళూరు కేఆర్ పురంలో ప్రారంభించింది. -
పెద్దమనసు చాటుకున్న సిద్ధరామయ్య!
సాక్షి బెంగళూరు : రాష్ట్రంలో నిద్రపోయేవారికి కాకుండా పని చేసే వారికి ఓటేయండి అని మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు, అందులో తప్పేమీ ఉందని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. శుక్రవారం బాదామిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తన ప్రతిష్ట, ప్రభావం మసకబారుతుందనడానికి బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు ఎవరని ప్రశ్నించారు. తన భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలు మాత్రమేనని, ఇలాంటి వ్యాఖ్యలను తాను ఏమాత్రం పట్టించుకోనన్నారు. కాంగ్రెస్ నుంచి చెదిరిపోయిన వెనుకబడిన తరగతులను ఏకం చేసేందుకు త్వరలో సమావేశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే విధంగా లోకసభ ఎన్నికల్లో ఓటమిపై క్షేత్ర స్థాయిలో సమాలోచనలు చేస్తున్నామని సిద్ధరామయ్య పేర్కొన్నారు. శాసనసభకు మధ్యంతర ఎన్నికలు వస్తాయని వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఆపరేషన్ కమలం అంటూ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవని ఎద్దేవా చేశారు. కాగా బాదామిలో ప్రజల నుంచి విజ్ఞప్తులు అందుకుంటున్న సందర్భంగా ఒక వితంతువు విజ్ఞప్తికి చలించి రూ. 50 వేల సొంత డబ్బు ఇచ్చి ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాల మహిళ కుటుంబాన్ని ఆదుకుంటానన్నారు. ఇటీవల పిడుగు పడి భర్త మరణించడంతో సదరు మహిళ కుటుంబం రోడ్డున పడింది. -
‘అదే జరిగితే.. జూన్ 1న రాజీనామా’
బెంగళూరు : యడ్యూరప్ప చెప్పినట్లు జూన్ 1న తమ ప్రభుత్వం పడిపోతే.. అదే రోజున తన పదవికి రాజీనామా చేస్తానంటూ కర్ణాటక సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ కూటమి అధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి.. దాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని.. త్వరలోనే వారు బీజేపీలో చేరతారని.. జూన్ 1 నాటికి జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యనించారు. తాజాగా సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలపై స్పందించారు. యడ్యూరప్ప సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నారని.. మరో నాలుగేళ్లు కూడా ఇలానే చెప్తారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినంతా మాత్రాన రాష్ట్రంలో కూడా అలానే జరగాలనుకోవడం అత్యాశ అన్నారు. తమ ప్రభుత్వం చాలా బలంగా ఉందని.. ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడటానికి సిద్ధంగా లేరని తెలిపారు. ఒక వేళ యడ్యూరప్ప చెప్పినట్లుగానే.. జూన్ 1న తమ ప్రభుత్వం కూలిపోతే.. అదే రోజున తాను తన పదవికి రాజీనామా చేస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. -
ఆయనే అసలైన ప్రత్యర్థి: సిద్దరామయ్య
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య యుద్ధంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కర్ణాటకలో రెండోసారి అధికారంలోకి వచ్చి, 2019 లోక్‌సభ ఎన్నికలకు కన్నడ ఫలితాలను ఓపెనింగ్స్‌గా భావించాలని సిద్దరామయ్య తీవ్రంగా శ్రమిస్తుంటే, మరోపక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దక్షిణ భారతంలో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ప్రచారంలో భాగంగా మోదీ, అమిత్ షా తమ రాష్ట్రంలో నిర్వహిస్తున్న వరుస ర్యాలీలపై సిద్దరామయ్య స్పందించారు. ఓ వార్తా ఛానల్‌తో సోమవారం మాట్లాడుతూ... పలు అంశాలను ప్రస్తావించారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలకు కర్ణాటకలో అంత ప్రజాదరణ లేదని, వారిని ప్రత్యర్థిగా భావించట్లేదన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పనే తమ అసలైన ప్రత్యర్థని సిద్దరామయ్య అన్నారు. దేశవ్యాప్తంగా మోదీకి ప్రజాదరణ తగ్గిందని, కన్నడ ఎన్నికల్లో ఆయన ప్రభావం ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు. అమిత్‌షా రోడ్ షోలను ప్రజలు పట్టించుకోరని, ఆయన షోలు కామెడి షోలను తలపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. గత వారం రోజులుగా మోదీ, అమిత్ షా ద్వయం వరుస ర్యాలీలతో కన్నడసీమలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా కర్ణాటకలో విజయం కాంగ్రెస్, బీజేపీకి అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ అధికారి నిలబెట్టుకుని ఈ ఏడాది జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే స్పూర్తిని కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కన్నడ సీమలో విజయం సాధించి దక్షిణ భారతంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాషాయ దళం ప్రయత్నిస్తోంది. కాగా గత నాలుగు దశాబ్ధాల్లో కర్ణాటకకు ఐదేళ్లు సీఎంగా కొనసాగిన వ్యక్తిగా సిద్దరామయ్య చరిత్ర సృష్టించారు. మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. -
వేడెక్కుతున్న కర్నాటకం
మండుటెండల్లో చెమట్లు కక్కుకుంటూ డజనుకి పైగా ర్యాలీల్లో పాల్గొన్నా రాని ఊపు ఒక్క ట్వీట్‌తో వచ్చేస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి జనాన్ని సమీకరించి బహిరంగ సభ నిర్వహించినా రాని ప్రచారం ఒక్క ఫేస్బుక్ పోస్టింగ్‌తో వచ్చేస్తోంది. నగర వీధుల్లో గల్లీ గల్లీ తిరిగినా రాని ఫలితం ఒక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా వచ్చేస్తోంది. అందుకే కర్ణాటకలో ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియా ఒక వార్ రూమ్‌గా మారిపోతోంది. ఎన్నికల ఎజెండాలు, వ్యూహాలు, హామీలు, ప్రత్యర్థులపై బురద జల్లడాలు ఏదైనా సోషల్ మీడియా వేదికగానే సాగుతోంది. ట్వీట్లు రీట్వీట్లు, ఫేస్బుక్ కామెంట్లు, వాట్సాప్ ఫార్వార్డ్లతో మండే ఎండలకు దీటుగా ఎన్నికల ప్రచార హీట్ పెరిగిపోతోంది. ఒక్క ట్వీట్‌తో రాజకీయ దుమారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన ఒక్క ట్వీట్ రాజకీయ దుమారాన్నే రేపింది. మోదీ కర్ణాటక ప్రచారానికి రానున్న నేపథ్యంలో ‘ఉత్తర భారతం దిగుమతుదారులైన ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. రాష్ట్రంలో బీజేపీకి నాయకులెవరూ లేరని వాళ్లు అంగీకరించారు. సీఎం అభ్యర్థి యడ్యూరప్పను డమ్మీగా మార్చేశారు. ప్రధాని రావొచ్చు, వెళ్లొచ్చు. కానీ విజేత ఎవరో అందరికీ తెలిసిందే’ అంటూ సిద్దరామయ్య ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఉత్తర, దక్షిణ భారతాల మధ్య విభజన తెచ్చేలా ఉందంటూ బీజేపీ మండిపడింది. ట్విట్టర్ వేదికగానే బీజేపీ నేతలు రీట్వీట్ల వర్షం కురిపించారు. చాముండేశ్వరిలో ఓటమి భయంతో సిద్దరామయ్య ఉత్తర, దక్షిణ భారతాలు అంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, మోదీ ఉత్తరం నుంచి దిగుమతి అయితే, 10 జన్‌పథ్ మరెక్కడి నుంచి వచ్చిందని అంటూ రీ ట్వీట్లు చేశారు. బెంగళూరులో మీ బాత్రూమ్కి ఇటలీ నుంచి సామాగ్రి తెచ్చుకుంటే అది దిగుమతి కాదా..? అత్యాచార కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీ వేణుని కర్ణాటక ఇన్చార్జ్గా కేరళ నుంచి దిగుమతి చేసుకోలేదా ? అంటూ బీజేపీ మద్దుతుదార్లు ట్వీట్లతో నిలదీశారు. కర్ణాటకలో ఓటర్లు: 4.96 కోట్లు స్మార్ట్ ఫోన్ ఉన్న ఓటర్లు: 3.5 కోట్లు ప్రతీ రోజూ ఇంటర్నెట్ వాడుతున్న ఓటర్లు: 3 కోట్లు ఫేస్బుక్ అకౌంట్ ఉన్న ఓటర్లు: 2.5 కోట్లు యూ ట్యూబ్ అలర్ట్ ఆప్షన్‌ను ఎంచుకున్న ఓటర్లు: 2.4 కోట్లు పార్టీల సోషల్ వ్యూహాలు కర్ణాటకలో అన్ని రాజకీయ పార్టీలు అనుక్షణం సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఎవరెక్కడ ఏ పోస్టు పెట్టినా గట్టిగా కౌంటర్ ఇస్తున్నాయి. సోషల్ మీడియా ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 5 వేల మంది వాలంటీర్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పరిశీలిస్తూ, పై చేయి సాధించడానికి వ్యూహాలను రచించే పనిలో ఉన్నారు. పార్టీ సోషల్ మీడియా రూమ్‌లో 67 టీవీలను ఏర్పాటు చేసి క్షణం క్షణం ఎన్నికల ప్రచార శైలిని గమనిస్తున్నారు. 23 వేల వాట్సాప్ గ్రూపుల్ని ఏర్పాటు చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీతో పోల్చి చూస్తే కాంగ్రెస్ సోషల్ మీడియా యూనిట్ చాలా చిన్నది. అందులో కేవలం 50 మంది వాలంటీర్లు మాత్రమే ఉన్నారు. ఫేస్బుక్ , ట్విట్టర్లో కాంగ్రెస్‌పై ఎలాంటి వ్యతిరేక ప్రచారం జరుగుతోందో గమనిస్తూ, దానిని కౌంటర్ చేసే పనిలో వీళ్లు ఉన్నారు. కాంగ్రెస్ టీమ్‌లో కొందరు జర్నలిజం, పొలిటికల్ సైన్స్ విద్యార్థులు కూడా చేరి గ్రాఫిక్ వర్క్స్‌తో పొలిటికల్ సెటైర్లు రూపొందిస్తున్నారు. జేడీ(ఎస్) కూడా సోషల్ మీడియాలో ఎంతో కొంత తన ఉనికిని చాటుకుంటోంది. కుమరన్న ఫర్ సీఎం పేరుతో ఒక డిజిటల్ గేమ్‌ను రూపొందించి ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. ఈ గేమ్‌ని ఆడేవాళ్లు ఒక్కో లెవల్ దాటుతూ ఉంటే అధికారంలో ఉన్నప్పుడు తాము రాష్ట్రానికి ఏమేం చేశాము, పార్టీ మేనిఫేస్టో వంటి వివరాలు వస్తుంటాయి. 50 మంది టెక్కీలతో సోషల్‌మీడియా రూమ్ కూడా ఏర్పాటు చేసి నగర ప్రాంత ఓటర్లని ఆకర్షించే పనిలో ఉంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఘనంగా బాహుబలి అభిషేకోత్సవం
మైసూరు (శ్రావణ బెళగొళ): కర్ణాటకలోని హాసన్ జిల్లా శ్రావణ బెళగొళలో బాహుబలి 88వ మహామస్తకాభిషేకాల్లో ప్రధాన ఘట్టమైన అభిషేకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. 12 ఏళ్లకోసారి నిర్వహించే మహామస్తకాభిషేకాన్ని చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య పవిత్రజలంతో బాహుబలిని అభిషేకించారు. అనంతరం జైన మునులు, భక్తులు బిందెలలోని పవిత్ర జలాలతో విగ్రహాన్ని అభిషేకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీఎం హోదాలో మహామస్తకాభిషేకాల్లో తొలిసారి పాల్గొన్నాననీ, ఇది తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని సీఎం వ్యాఖ్యానించారు. -
మోదీ టెన్ పర్సెంట్ వ్యాఖ్యలకు సిద్ధూ కౌంటర్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక సర్కార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ టెన్‌పర్సెంట్ (కమీషన్) ప్రభుత్వంగా అభివర్ణించడంపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తి రాజకీయ కోణంలో ఇంతలా దిగజారడం తగదని హితవు పలికారు. తమ ప్రభుత్వాన్ని పదిశాతం సర్కార్‌గా మోదీ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని, ఆయన వ్యాఖ్యలు నిరాధారమైనవని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘యడ్యూరప్ప సీఎంగా పనిచేసిన కాలంలో ఏం జరిగిందో మోదీ ఆయనను అడగాల్సింది...బీజేపీ కర్ణాటకను దోచుకుంది..మైనింగ్ స్కామ్‌లో జనార్ధన్రెడ్డిలా యడ్యూరప్ప జైలుకు వెళ్లా’ రని సిద్ధూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్లు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు లోకాయుక్తను నియమించారా అని నిలదీశారు. గోద్రా అల్లర్లు ఆయన హయాంలోనే జరిగాయన్న సంగతి గుర్తెరగాలన్నారు. తమపై మోదీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయపూరితమైనవని అన్నారు.యడ్యూరప్ప స్ధాయికి దిగజారి మోదీ మాట్లాడటం కర్ణాటక ప్రజలను అవమానించినట్టేనని సిద్ధూ ఆరోపించారు. -
కావేరీ నీటిని వదిలేది లేదు: కర్ణాటక సీఎం
నేటి భేటీ తర్వాత తదుపరి నిర్ణయం: కర్ణాటక సీఎం సాక్షి, బెంగళూరు: ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడుకు కావేరి నీటిని వదిలేది లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన గురువారం జరిగే ఉన్నతస్థాయి సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పన ఈ నెల 30 వరకూ నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటకను ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉదయం 9.30 గంటలకు అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో వెల్లడైన అంశాలపై చర్చించడానికి తర్వాత మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. రెండు సమావేశాల్లోనూ మెజారిటీ సభ్యులు తమిళనాడుకు నీటిని వదలకూడదని తేల్చిచెప్పారు. -
నిద్రావస్థలో సర్కార్
కరువు నివారణ చర్యలేవీ? ఎమ్మెల్యే కాశప్పను అరెస్ట్ చేయాలి బీజేపీలో డబ్బు తీసుకునే సంస్కృతి లేదు కుమారస్వామి జేడీఎస్ గురించి ఆలోచిస్తే మంచిది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో తీవ్ర కరువు ఛాయలు ఏర్పడినా నివారణ చర్యలు తీసుకోవడంలో సిద్ధు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి విమర్శించారు. నగరంలో బీజేపీ స్లం మోర్చా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్దరామయ్య హావభావాలు, చేస్తున్న వ్యాఖ్యలను బట్టి ఆయన ఐదేళ్లు పదవిలో కొనసాగుతారనే నమ్మకం ఆయనకే లేదని స్పష్టమవుతోందని అన్నారు. రాష్ట్ర మంత్రులు మహాదేవ ప్రసాద్, అంబరీష్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా పోలీసులపై దాడి చేసిన ఎమ్మెల్యే కాశప్పను ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఒక చట్టం,సామాన్యులకు మరొక చట్టం ఉంటుందా? అని ప్రశ్నించారు. విధాన పరిషత్, రాజ్యసభ సభ్యులుగా బీజేపీ బలోపేతానికి పని చేసిన వారిని ఎంపిక చేశామని, డబ్బు తీసుకుని పదవులు ఇచ్చే సంస్కృతి బీజేపీలో లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీపై ఆరోపణలు చేసేముందు ఎమ్మెల్సీ ఎంపికపై సొంత పార్టీ నాయకులే ఏమంటున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు. -
జగడాలమారి జయ
ముఖ్యమంత్రి ఆగ్రహం . బెంగళూరు : తమిళనాడులో జయలలిత అధికారంలో ఉన్నప్పుడల్లా కావేరి జలాల పంపిణీ జఠిలంగా మారుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రతి చిన్న విషయానికి ఆమె కయ్యానికి కాలు దువ్వుతూ జగడాలమారిగా తయారయ్యారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయనిక్కడ కన్నడ సాహిత్య పరిషత్ శతాబ్ది ఉత్సవాల భవన నిర్మాణానికి శంకు స్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. కావేరి నిర్వహణా మండలి అవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ, జయలలిత పదే పదే అర్జీలు సమర్పించి ఎదురు దెబ్బలు తింటున్నారని విమర్శించారు. జయతో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పోటీ పడుతూ ప్రధానికి లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. జయలలిత రాజకీయ లబ్ధి కోసం కావేరి వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మినహా తమిళనాడుకు నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువగానే నీటిని వదులుతున్నామని చెప్పారు. కేఆర్. సాగర్ కర్ణాటకలో ఉన్నందున, ఈ రాష్ట్ర రైతులకు ఎక్కువ ప్రయోజనాలు కలగాలని అన్నారు. అయితే జలాశయం నుంచి ఎక్కువ నీరు తమిళనాడు పాలవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణే మార్గం ప్రాథమిక విద్యా బోధన మాతృ భాషలోనే సాగడానికి రాజ్యాంగ సవరణ మాత్రమే ఏకైక మార్గమని సీఎం అన్నారు. భాషా మాధ్యమంపై ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు వల్ల మాతృ భాష ఉనికికి ప్రమాదం ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సానుకూల ఆదేశాలు రాకపోతే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం కేవలం కన్నడంపైనే కాకుండా, అన్ని ప్రాంతీయ భాషలపై ఉంటుందని చెప్పారు. అంగ్లాన్ని ఓ భాషగా ఎవరూ వ్యతిరేకించడం లేదని, ఎల్కేజీ నుంచి దానిని నేర్చుకున్నప్పటికీ, స్థానిక భాషలను విస్మరించరాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కన్నడ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఉమాశ్రీ, రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు. -
నిద్ర మత్తులో సిద్ధు సర్కార్
హొస్పేట : రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రమత్తులో జోగుతోందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జగదీష్ శెట్టర్ తెలిపారు. సోమవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సిద్దరామయ్య గాఢనిద్రలో ఉన్నారని, వారిని వైద్యులకు చూపించాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో న్యాయాంగ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి పోయిందన్నారు. పోలీస్ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కేసులు నమోదు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. హోంమంత్రి వారికి సరైన బుద్ధి చెప్పడం పోయి టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తూ చర్చల్లో పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనైతిక కార్యకలాపాలు, అక్రమ ఇసుక మాఫీయాలు అధికమయ్యాయన్నారు. అక్రమ ఇసుక మాఫియా వెనుక మంత్రుల పుత్రుల హస్తముందన్నారు. సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు జరగలేదన్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ చెరుకుకు కల్పించిన మద్దతు ధర రూ.2650లు ఇంత వరకు ఒక్క రైతుకు కూడా అందలేదన్నారు. ఈ శాన్య ఉపాధ్యాయుల విధాన పరిషత్ అభ్యర్థి శశీల్ జీ.నమోషి తరుపున కొప్పళ, బళ్లారి జిల్లాలో ప్రచారం చేశామన్నారు. శశీల్ జీ.నమోషి ఈశాన్య ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా నాలుగో సారి గెలువడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రవేశ పెట్టిన పథకాలను నేడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయడం తమకెంతో బాధగా ఉందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్.ఈశ్వరప్ప, మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప, మాజీ ఎమ్మెల్యే ఎన్టీ.బొమ్మన్న, బీజేపీ జిల్లాధ్యక్షుడు కే.నేమిరాజ్‌నాయక్, బీజేపీ నేతలు రామలింగప్ప, భరమలింగనగౌడ, సందీప్‌సింగ్, చంద్రకాంత్ కామత్ పాల్గొన్నారు. -
ఇక బెట్టింగ్‌ల పర్వం
అభ్యర్థుల గెలుపోటములపై భారీగా పందాలు డబ్బు కోసం కార్లు, ఇళ్లు, స్థలాలు సైతం కుదవ పెడుతున్న వైనం బెంగళూరు, శివమొగ్గ,న్యూస్‌లైన్ : రాష్ర్టంలోని 28 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ముగియడంతో అభ్యర్థుల గెలుపోటములపై పందెం రాయుళ్లు రూ. లక్షల వరకు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మాజీ ప్రధాని, ఐదు మంది మాజీ ముఖ్యమంత్రులు ఎన్నికల బరిలో దిగడంతో వారికి లభించే మెజార్టీ తదితర అంశాలపై పందాలు జోరందుకున్నాయి. బైక్‌లు, కార్లు, ఖాళీ ఇంటి స్థలాలు సైతం బెట్టింగ్‌లో పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని కొందరు, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు లభిస్తాయని మరి కొందరు బెట్టింగ్ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తక్కువ స్థానాలు లభిస్తే ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీటుకు ఎసరు వస్తుందని మరికొందరు బెట్టింగ్ కడుతున్నారు. హాసన్ నుంచి బరిలోకి దిగిన మాజీ ప్రధాని హెచ్ .డీ. దేవేగౌడ అత్యధిక మెజార్టీ సాధిస్తారని కొందరు, ప్రత్యర్థి పార్టీ వారే గెలుస్తారని పందాలు సాగుతున్నాయి. చిక్కబళ్లాపురం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రులు వీరప్ప మొయిలీ (కాంగ్రెస్), హెచ్.డీ. కుమారస్వామి (జేడీఎస్), బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బచ్చేగౌడ బరిలో ఉండగా ఇక్కడ బీజేపీ, జేడీఎస్‌లపై పెద్ద సంఖ్యలో బెట్టింగ్‌లకు దిగారు. బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజక వర్గం, బెంగళూరు దక్షిణ నియోజక వర్గం, మండ్య, ఉడిపి- చిక్కమంగళూరు, ధార్వాడ, బెంగళూరు గ్రామీణ జిల్లాల నుంచి బరిలోకి దిగిన హేమాహేమీల గెలుపోటములపై పందాలు సాగుతున్నాయి. శివమొగ్గలో బీజేపీ నుంచి మాజీముఖ్యమంత్రి యడ్యూరప్ప, జేడీఎస్ నుంచి గీతశివరాజ్కుమార్, కాంగ్రెస్ నుంచి మంజునాథ్ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ, జేడీఎస్ మధ్యనే పోటీ ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులపై పందాలు జోరందుకున్నాయి. గతంలో ఐపీఎల్ టీ 20 క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు తెరలేపిన వారే ప్రస్తుతం రాజకీయ పార్టీల గెలుపోటములపై పందాలు స్వీకరిస్తున్నట్లు తెలిసింది. రూ.1000 నుంచి రూ. లక్ష ,అంతకన్నా ఎక్కువ మొత్తంలో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈ లోక్‌సభ ఎన్నికలలలో 10 శాతం ఓటింగ్ ఎక్కువ జరగడంతో బెట్టింగ్ దందా జోరందుకునిందని పలు పార్టీల నాయకులు అంటున్నారు. విశ్రాంతి తీసుకుంటున్న నేతలు ఎన్నికల క్రతువు ప్రారంభమైనప్పటినుంచి నామినేషన్లు, ప్రచారం, పోలింగ్ వరకు రోజూ నిద్ర లేకుండా పనిచేసిన నేతలు ప్రస్తుతం సేదతీరుతున్నారు. పోలింగ్ వరకు నేతలు ఓటర్లుకు అందుబాటులో ఉండేవారు. కేవలం మిస్‌కాల్ ఇచ్చినా క్షణాల్లో ఫోన్ చేసి చేసి మాట్లాడేవారు. పోలింగ్ ముగియడంతో చాలా మంది నేతలు సెల్ఫోన్లు పనిచేయడం లేదు. ఎవరికి ఫోన్ చేసినా నాట్‌రీచబుల్, స్విచ్ఆఫ్ వస్తున్నాయి. మరికొందరి నేతల ఫోన్లు రింగవుతున్నా స్పందించడం లేదు. తిండి తిప్పలు లేకుండా మండే ఎండల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నేతలు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొందరు ఏ సెగ్మెంట్లో ఎంతమెజారిటీ వస్తుంది, ఏయే బూత్‌లలో ఎన్ని ఓట్లు పడ్డాయనే దానిపై మద్దతుదారుల ద్వారా సమాచారాన్ని సేకరించే పనిలో తలమునకలై ఉన్నారు. -
నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు
ముఖ్యమంత్రి సిద్దరామయ్య గంగావతి, న్యూస్‌లైన్ : నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య జోష్యం చెప్పారు. ఆయన శనివారం స్థానిక క్రీడా మైదానం ఆవరణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభనుద్దేశించి మాట్లాడారు. నరేంద్రమోడీ గుజరాత్లో 13 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నాడని, అయినా ఆ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మానవ అభివృద్ధి దృష్ట్యా గుజరాత్ 9వ స్థానంలో ఉందని, మనిషి సగటు అభివృద్దిని పరిశీలిస్తే 12వ స్థానంలో ఉందని చెప్పారు. పౌష్టికాహారం కొరత ఉన్నవారు 55 శాతం మంది ఉన్నారన్నారు. ఒకటవ తర గతి విద్యాభ్యానికి స్వస్తి పలికి బడులు మానుకున్న పిల్లలు 60 శాతం మంది ఆ రాష్ట్రంలో ఉన్నారని విమర్శించారు. నరేంద్రమోడీ అపద్దాలను ప్రచారం చేస్తూ దేశంలో సంచరిస్తున్నారని విమర్శించారు. ఆయన కర్ణాటక రాష్ట్రానికి నాలుగు సార్లు పర్యటించినపుడు ఆయన కుడి ఎడమ వైపు అవినీతి పరులను పెట్టుకొని తాను ఉపన్యసిస్తూ అవినీతిని అంతమొందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన అవినీతిలో కూరుకుపోయి జైలుపాలు అయిన యడ్యూరప్ప, కట్ట సుబ్రమణ్యం నాయుడు, సదానందగౌడ, జగదీశెట్టర్లాంటి అవినీతిపరులతో ప్రచారం చేపట్టడం విచారకరమన్నారు. ఆయన సభలో పాల్గొన్న మాజీ ఉపముఖ్యమంత్రి ఈశ్వరప్ప ఇంట్లో దొంగనోట్లను ముద్రించే రెండు యంత్రాలను లోకాయుక్త స్వాధీనం చేసుకోవడం ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్వధర్మాలను పరిగణలోకి తీసుకొని వారికి సముచితమైన న్యాయాన్ని కల్పించే ఏకైక పార్టీ అన్నారు. బీజేపీ ఒకే ధర్మం, ఒకే సంస్కృతి, ఒక్కరే నాయకుడన్న ధోరణులతో దేశాన్ని పాలించగలదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి సిద్దరామయ్య ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శలు చేయడం సరికాదన్నారు. తమ పాలనలో పేద ప్రజలకు రుణాలను మాఫీ చేయడం, అలాగే పక్కా ఇళ్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. రూ.2.10 కోట్లను రాష్ట్రంలో పాలఉత్పత్తి దారులకు సహాయధనాన్ని అందిస్తున్నామన్నారు. కోటి 5 లక్షల మంది పిల్లలకు వారంలో మూడు రోజులకు ఒకసారి 150 మిల్లిలీటర్ల పాలు అందిస్తున్నామన్నారు. రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలను, రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు మూడు శాతం వడ్డీతో రుణసౌకర్యం కల్పించామన్నారు. ఆర్టికల్-371 కు సంబంధించి రూ.1630 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను కేంద్రప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. కొప్పళ్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బసవరాజ్ హిట్నాళ్కు మీ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ వేదికపై కేంద్ర మాజీ మంత్రి సీఎం.ఇబ్రహీం, యలబుర్గా ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి, రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి, మాజీ సభాపతి వీరణ్ణ మత్తికట్టి, మాజీ ఎమ్మెల్సీ హెచ్ఆర్ శ్రీనాథ్, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం నాగరాజు, కొప్పళ ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాళ్, మాజీ మంత్రులు మల్లికార్జున నాగప్ప, సాలోణి నాగప్ప, కొప్పళ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బసవరాజ్ హిట్నాళ్, పార్టీ కనకగిరి బ్లాక్ అధ్యక్షుడు రెడ్డిశ్రీనివాస్, గంగావతి బ్లాక్ అధ్యక్షులు హనుమంతప్ప నాయక్, జిల్లా పంచాయితీ అధ్యక్షులు పీ. జనార్దన్, గంగావతి తాలూకా పంచాయితీ అధ్యక్షులు రాజేశ్వరి సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఫైనల్ టచ్
బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో ప్రధాన పార్టీలు బుధవారం తలమునకలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా, హఠాత్తుగా పర్యటన రద్దయింది. దీంతో ఢిల్లీ నుంచే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీలు ఆయనతో ఫోనులో సంభాషించారు. మరో వైపు నగరంలోని బీజేపీ కార్యాలయంలో కూడా పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. తొలి జాబితాలో బీజేపీ 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన ఎనిమిది నియోజక వర్గాలకు కూడా సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదానికి పంపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఈశ్వరప్ప, అశోక్, మాజీ మంత్రి అరవింద లింబావళి పాల్గొన్నారు. బీఎస్ఆర్ సీపీ విలీనానికి మొగ్గు రాష్ర్ట మాజీ మంత్రి శ్రీరాములు నాయకత్వంలోని బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవడం వైపే సమావేశంలో నాయకులందరూ మొగ్గు చూపారు. ఆ పార్టీ ఇదివరకే విలీనంపై నిర్ణయం తీసుకుందని జోషి తెలిపారు. కనుక దీనిపై సానుకూలంగా స్పందించాలని అధిష్టానాన్ని కోరామని విలేకరులతో చెప్పారు. మరో వైపు యడ్యూరప్ప తన అనుయాయులకు టికెట్లు ఇచ్చి తీరాల్సిందేనని సమావేశంలో పట్టుబట్టారు. తుమకూరు ప్రస్తుత ఎంపీ జీఎస్. బసవరాజుకు తిరిగి టికెట్టు ఇవ్వాలని, ఉడిపి-చిక్కమగళూరు స్థానానికి మాజీ మంత్రి శోభా కరంద్లాజె, బీదర్ స్థానానికి సూర్యకాంత్ నాగమారపల్లిలను ఎంపిక చేయాలని ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా జేడీఎస్ జాబితా జేడీఎస్ తుది జాబితా ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశాలున్నాయి. 12 మందితో ఆ పార్టీ తొలి జాబితాను ఇదివరకే ప్రకటించింది. మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. సాధారణంగా కాంగ్రెస్, బీజేపీల కంటే చివరన జాబితాలను ప్రకటించే జేడీఎస్, ఈసారి ఆ పార్టీల కంటే ముందుగానే విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది. జంపింగ్‌లు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ తేజస్విని రమేశ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఆమె బీజేపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. టీవీ జర్నలిస్టు అయిన తేజస్విని 2004 లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి కనకపుర నియోజక వర్గంలో మాజీ ప్రధాని దేవెగౌడను ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించారు. విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్‌కు ప్రత్యర్థి అయిన ఆమెకు క్రమంగా పార్టీలో ఆదరణ లభించలేదు. దీంతో బీజేపీలో చేరాలని నిర్ణయించారు. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గాన్ని ఆమె ఆశిస్తున్నప్పటికీ, ఇప్పటికే పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. కనుక బీజేపీ ఆమెకు ఏ బాధ్యత అప్పగిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాంగ్రెస్‌లో మహిళలంటే చులకన భావం ఉందని ఆమె విమర్శించారు. మరో వైపు యడ్యూరప్పకు అత్యంత ఆప్తుడైన వీ. ధనంజయ్ కుమార్ జేడీఎస్‌లో చేరనున్నారు. ఉడిపి-చిక్కమగళూరు స్థానం నుంచి ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు. దీనిపై ఆ జిల్లాకు చెందిన జేడీఎస్ నాయకులు బుధవారం ఇక్కడ ఆయనతో చర్చించారు.