కానిస్టేబుల్‌ను చెంపపై కొట్టిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌ | Farmar BJP MLA Slapping Police Constable In Karnataka | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ను చెంపపై కొట్టిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌

Published Tue, Nov 9 2021 9:09 AM | Last Updated on Tue, Nov 9 2021 9:27 AM

Farmar BJP MLA Slapping Police Constable In Karnataka - Sakshi

సాక్షి, రాయచూరు రూరల్‌ (కర్ణాటక): మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డిని అరెస్ట్‌ చేయాలని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర న్యాయ సలహాదారుడు రామన్న డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఇటీవల జరిగిన ఓ ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశారని, ఈ ఘటన జరిగిన ఐదు రోజులు గడుస్తున్నా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు . 

కాంగ్రెస్‌ లీడర్‌ సిద్ధరామయ్య ఆధ్వర్యంలో నవంబరు 3న జరిగిన నిరసన కార్యక్రమంలో సదరు మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి రెచ్చిపోయాడు. ఏకంగా .. కానిస్టేబుల్‌ రాఘవేంద్రను పట్టుకుని దూశించాడు. అంతటితో ఆగకుండా కానిస్టేబుల్‌  చెంప ఛెళ్లుమనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే ఎమ్మెల్యేపై తగిన చర్యలు కోవాలని రామన్న అధికారులను కోరారు. 

చదవండి: పోలీసుల టార్చర్‌.. పురుగుల మందు తాగి ఐదుగురు మృతి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement