
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్లో పెరిగిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రెండుసినిమాలు (సాహో, జాన్ (వర్కింగ్ టైటిల్))లు కూడా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు రిలీజ్ కానుంది. ‘జాన్’ కూడా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
మరి.. ప్రభాస్ నెక్ట్స్ చిత్రం ఏంటి? అంటే... ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని వార్తలు వచ్చాయి. తాజాగా క్రిష్ణ అనే కొత్త దర్శకుడితో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని టాక్. దర్శకుడు రాజమౌళి దగ్గర క్రిష్ణ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారట. మరి... అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హీరోతో కొత్త దర్శకుడికి సినిమా చేసే ఛాన్స్ దక్కుతుందా? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment