చాన్స్‌ వస్తే బాహుబలి 3లో చేస్తా | Nidhi Agarwal Visit Park Hotel In Hyderabad | Sakshi
Sakshi News home page

చాన్స్‌ వస్తే బాహుబలి 3లో చేస్తా

Published Tue, Jun 11 2019 7:03 AM | Last Updated on Tue, Jun 11 2019 7:03 AM

Nidhi Agarwal Visit Park Hotel In Hyderabad - Sakshi

నిధి

బాహుబలి లాంటి సినిమాలో నటించడం ఏ నటికైనా కల సాకారం కావడమేనని బాహుబలి 3 తీస్తే అందులో తనకు అవకాశం వస్తే ఆనందంగా చేస్తానని చెప్పింది బాలీవుడ్‌ నటి నిధి అగర్వాల్‌. ప్రముఖ టైర్ల బ్రాండ్‌ ఎఆర్‌ఎల్‌ టైర్స్‌  ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ది పార్క్‌  హోటల్‌లో జీతో షాన్‌ సే కార్యక్రమాన్ని ఆమె సోమవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ టాలీవుడ్‌లో తాను నటించిన గత 2 చిత్రాలతో పోలిస్తే త్వరలో విడుదల కానున్న ఇస్మార్ట్‌ శంకర్‌ తనకెంతో ప్రత్యేకమని ఈ సినిమా విడుదల కోసం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. తనకు అత్యంత ఇష్టమైన హాబీ ట్రావెలింగ్‌ అని చెప్పిన నిధి... పనిలో కాస్త విరామం చిక్కినా ఎక్కడో ఒక చోటకి టూర్‌ వెళ్లిపోతానని, తన ఇన్‌స్ట్రాగామ్‌ ఫాలోయర్స్‌ అందరికీ తన ట్రావెల్‌ హాబీ ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తుందంటూ నవ్వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement